
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లియో. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ ఎస్ లలిత్‌కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, అర్జున్, కదిర్, మన్సూర్ అలీఖాన్, దర్శకుడు మిష్కిన్, గౌతమ్ మీనన్, మలయాళం నటుడు మ్యాథ్యూ థామస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
మాస్టర్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందుతున్న లియో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికి కొంత షూటింగ్ పూర్తయింది. ప్రస్తుత షూటింగ్ చైన్నెలో ముమ్మరంగా జరుగుతోంది. 20 రోజుల పాటు జరిగే ఈ చిత్ర షూటింగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. లియో చిత్రాన్ని అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా ఇందులో విజయ్ రెండు గెటప్‌లలో కనిపించబోతున్నట్లు తాజా సమాచారం. ఒకటి లియో అనే గ్యాంగ్‌స్టర్ గెటప్ కాగా, మరొకటి చాక్లెట్లు తయారు చేసే పార్తీపన్ అనే సాధారణ యువకుడు గెటప్‌లోనూ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో విజయ్ రెండు గెటప్‌లలో కనిపిస్తారా, లేక రెండు పాత్రలో నటిస్తున్నారా..? అన్నది తెలియాల్సి ఉంది. కాగా దీనికి అనిరుథ్ సంగీతాన్ని, మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment