లియో.. ఈ సినిమాను ప్రకటిస్తూ మొదట్లో ఓ వీడియోని వదిలారు మేకర్స్. అప్పటి నుంచి ఈ చిత్రంపై తమిళ్‌లోనే కాదు తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి కారణం హీరో విజయ్‌తో పాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ ముగ్గురు తెలుగు ప్రేక్షకులను సుపరిచితమే. అందుకే దసరా బరిలో ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఉన్నప్పటికీ..‘లియో’పై మాత్రం క్రేజ్ తగ్గలేదు.
కానీ ఎప్పుడైతే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ‘లియో’పై అంచనాలు తగ్గతూ వచ్చాయి. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన సినీ ప్రేక్షకులను ట్రైలర్ ఆశించిన స్థాయితో మెప్పించలేకపోయింది. తెలుగు ప్రేక్షకులే కాదు తమిళ ఆడియన్స్‌ని కూడా ఈ ట్రైలర్ మెప్పించలేకపోయింది.
ఆకట్టుకోలేకపోయిన ట్రైలర్
‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి సాలిడ్ హిట్లను అందించిన లోకేశ్.. లియోని కూడా అదేస్థాయిలో తీర్చిదిద్దారని అంతా భావించారు. తీరా ట్రైలర్ చూస్తే..ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు. అయితే ట్రైలర్ చూసి ‘లియో’పై ఒక అంచనాకు రావొద్దని, సినిమాలో అనేక సర్‌ప్రైజ్‌లు ఉంటాయని టీమ్ చెబుతుంది. కానీ ఎవరైనా ట్రైలర్ చూసే సినిమాపై ఓ అంచనాకు వస్తారు. అందుకే ట్రైలర్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ లియో విషయంలో మాత్రం ట్రైలర్ బజ్‌ని క్రియేట్ చేయలేకపోయింది.
తగ్గిన ఆసక్తి
'లియో'.. తెలుగు థియేట‍్రికల్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. విడుదలకు ఇంకా వారం రోజులు కూడా లేదు..అయినా కూడా ప్రమోషన్స్ ప్రారంభించలేదు. డబ్బింగ్ విషయంలో కూడా క్వాలిటీ లేదనే విషయం ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఇక తాజాగా ‘లియో’ నుంచి రిలీజ్ చేసిన ‘నే రెడీ’ పాట కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో లియోపై మొదట్లో ఉన్నంత ఆసక్తి అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో లేదు. అయితే లోకేశ్ కనగరాజ్ మేకింగ్‌పై మాత్రం నమ్మకం ఉంది. కచ్చితంగా తనదైన స్క్రీన్‌ప్లేతో సర్‌ప్రైజ్ చేస్తాడని సినీ పండితులు చెబుతున్నారు. తెలుగులో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment