
నటుడు విజయ్ 67వ చిత్రం లియో. త్రిష నాయకిగా చేస్తున్నారు. ప్రియా ఆనంద్ మరో హీరోయిన్. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, నటుడు అర్జున్, దర్శకుడు గౌతమ్‌మీనన్, మిష్కిన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 'విక్రమ్'తో సంచలన విజయం తరువాత లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం లియో. 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కశ్మీర్‌లో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. విజయ్, త్రిష, మిష్కిన్‌తో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు.
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ లియో షూటింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇది. అదేవిధంగా కేజీఎఫ్ 2 తరువాత దక్షిణాదిలో నటిస్తున్న చిత్రం. కాగా లియోలో సంజయ్‌దత్ ఎంట్రీ ఇచ్చిన ఫొటోలను చిత్ర యూనిట్ శనివారం మీడియాకు విడుదల చేసింది. ఇందులో సంజయ్‌దత్‌ను విజయ్ ఢీకొనే సన్నివేశాలు బీభత్సంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. దీంతో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న లియో చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదివరకే రిలీజైన చిత్ర టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా చిత్రాన్ని సెప్టెంబర్ 7వ తేదీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తు న్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment