
లియో చిత్ర విడుదలకు ముందు వ్యాపారం రూ.300 కోట్లు దాటాలనేది విజయ్ ప్లాన్ అట. అదేవిధంగా ఈసారి తన చిత్ర వసూళ్లు రూ.1000 కోట్లు దాటే విధంగా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.
అభిమానుల దళపతి విజయ్. ఈయన చిత్రం వస్తుందంటే కోలాహలం మొదలవుతుంది. ఇటీవల విజయ్ కథానాయకుడుగా నటించిన వారిసు(వారసుడు) చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం అతడు లియో అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంతో లియో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చాలా గ్యాప్ తరువాత విజయ్‌తో త్రిష జత కడుతున్నారు. ఇతర ముఖ్యపాత్రలో దర్శకుడు మిష్కిన్, గౌతమ్‌మీనన్, మన్సూర్ అలీఖాన్ నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం నాలుగవ షెడ్యూల్ చైన్నెలో జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో రజనీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న జైలర్ చిత్రం తెరపైకి రానుంది.
దీంతో ఈసారి విజయ్, రజనీకాంత్ చిత్రాలు ఢీకొనే అవకాశం ఉంది. ఇకపోతే లియో చిత్రం కోసం నటుడు విజయ్ భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చిత్ర వ్యాపారానికి ఒక టార్గెట్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్. లియో చిత్ర విడుదలకు ముందు వ్యాపారం రూ.300 కోట్లు దాటాలనేది విజయ్ ప్లాన్ అట. అదేవిధంగా ఈసారి తన చిత్ర వసూళ్లు రూ.1000 కోట్లు దాటే విధంగా స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు విడుదలైన పొన్నియిన్ సెల్వన్–1, విక్రమ్ చిత్రాల వసూళ్లు రూ.500 కోట్లు దాటడంతో తన చిత్రం వసూళ్లు రూ.1000 కోట్లు రీచ్ అయ్యేలా విజయ్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.
చదవండి: మహారాణిగా రష్మిక మందన్నా