బ్లాక్‌బస్టర్‌ దిశగా లియో. తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే? ఏ ఓటీటీలో.. | Leo Movie Box Office Collection Day 1 And OTT Details | Sakshi
Sakshi News home page

Leo Movie: లియో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎన్ని వందల కోట్లంటే? ఏ ఓటీటీలోకి రానుందంటే?

Published Fri, Oct 20 2023 12:01 PM | Last Updated on Fri, Oct 20 2023 12:45 PM

Leo Movie Box Office Collection Day 1 And OTT Details - Sakshi

స్టార్‌ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం లియో. ఈ సినిమా పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పుడు లుక్‌ బాలేదని, సినిమా ఫలితం బెడిసికొట్టేలా ఉందని విమర్శలు వినిపించాయి. కానీ ఈ భయాలన్నింటినీ పటాపంచలు చేస్తూ తొలిరోజే బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకుపోతోంది లియో. త్రిష కథానాయికగా నటించిన ఈ మూవీ అక్టోబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు లియో బ్లాక్‌బస్టర్‌, లియో డిజాస్టర్‌ అన్న రెండు హ్యాష్‌ట్యాగ్స్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అయ్యాయి. దీంతో సినిమా ఫలితేమంటి చెప్మా? అని నెటిజన్లు డౌట్‌ పడ్డారు. కట్‌ చేస్తే బ్లాక్‌బస్టర్‌ దిశగా లియో పరుగులు పెడుతోంది.

సెంచరీ దాటిన వసూళ్లు
తొలి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.132 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగిస్తే రికార్డులు బద్ధలవడం ఖాయంగా కనిపిస్తోంది. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని సెవెన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌, జగదీశ్‌ పళనిసామి నిర్మించారు. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, మన్సూర్‌ అలీ ఖాన్‌, మాథ్యూ, మిస్కిన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర డిజిటల్‌ రైట్స్‌ విషయానికి వస్తే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ లియో స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

లియో రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇందుకోసం భారీగానే డబ్బు ముట్టజెప్పినట్లు సమాచారం. ఈ మూవీ థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నవంబర్‌ మూడో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే లియో థియేటర్‌లో ఎక్కువకాలం కలెక్షన్ల వరద పారించినట్లయితే ఓటీటీలోకి మరింత ఆలస్యంగా వచ్చే అవకాశమూ లేకపోలేదు.

చదవండి: టాటూ ట్విస్ట్‌.. ఐ లవ్యూ చెప్పిన తేజ.. థూ అని ఊసిన శోభ.. చులకనవుతున్న అమర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement