దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిష్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం, మనోజ్ పరమహంస ఛాయగ్రహణం అందిస్తున్నారు. కాగా ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో భారీ ఎత్తున నిర్మించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' కొత్త పోస్టర్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్!?)
లియో చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇప్పటికే వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన విజయ్.. విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన యూనిట్‌తో మళ్లీ షూటింగ్ చేయడానికి కశ్మీర్‌కు వెళ్లారన్నది తాజా సమాచారం. ఇప్పుడిదే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది.
అసలు విషయం ఏమిటంటే 'లియో' షూటింగ్ ఇంతకు ముందు కశ్మీర్‌లో చేశారు. అయితే అక్కడ ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉందట. దీంతో ఆ వర్క్ పూర్తి చేయడానికి లియో చిత్ర యూనిట్ మళ్లీ కశ్మీర్‌కు వెళ్లారు. అక్కడ 10 రోజులు షూటింగ్ నిర్వహించి చైన్నె తిరిగి వస్తారని తెలిసింది. ఇందులో విజయ్ పార్ట్ ఏం లేదని తెలుస్తోంది. ఇకపోతే 'లియో'పై తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలున్నాయి. 'విక్రమ్', 'ఖైదీ' చిత్రాలతో దీనికి లింక్ ఉండటమే కారణంగా తెలుస్తోంది.
(ఇదీ చదవండి: మహేశ్‌బాబు గురించి ఇవి మీకు తెలిసే ఛాన్స్ లేదు!)
Comments
Please login to add a commentAdd a comment