I will do 10 movies and quit': Leo director Lokesh Kanagaraj - Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraj: కేవలం పది సినిమాలే చేస్తా.. లోకేశ్ కనగరాజ్ షాకింగ్ డెసిషన్!

Published Tue, Jun 20 2023 3:18 PM | Last Updated on Tue, Jun 20 2023 3:36 PM

Leo director Lokesh Kanagaraj says he will do 10 movies and quit - Sakshi

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఖైదీ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు చూసేలా చేశాడు లోకేశ్.  

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో లియో సినిమా చేస్తున్నారు. అయితే ఇటీవల హీరో విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా లోకేశ్ అందరికీ ఊహించని షాక్‌ ఇచ్చారు. హాలీవుడ్ డైరెక్టర్ క్వింటెన్‌ టరెంటీనోలా మాదిరిగానే పది సినిమాలు మాత్రమే చేస్తానని వెల్లడించారు. ఆ తర్వాత డైరెక్షన్‌ ఆపేస్తానని ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 

( ఇది చదవండి: Adipurush: సినిమాను బ్యాన్‌ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ)

లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ..'నాకు ఎలాంటి సుదీర్ఘమైన ప్రణాళికలు లేవు. సినిమా ఇండస్ట్రీలో శాశ్వతంగా ఉండిపోవాలని నాకు ఆలోచన లేదు. నేను సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చా. అందుకే మొదట షార్ట్‌ ఫిల్మ్స్‌ చేశా. నా టార్గెట్ కుదిరాకే ఈ పనిని వృత్తిగా స్వీకరించా. నేను పది సినిమాలు మాత్రమే చేస్తా. ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తా.' అని అన్నారు.

కాగా.. లోకేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లియో కశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తి చేశారు. ప్రస్తుతం చెన్నైలోనే షూటింగ్‌ జరుగుతోంది. జులై చివరి నాటికి సినిమా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సరసన త్రిష నటిస్తోంది. సంజయ్‌ దత్‌, ప్రియా ఆనంద్‌, మిస్కిన్‌, గౌతమ్ వాసుదేవ మేనన్‌, మన్సూర్ అఖీఖాన్‌, శాండీ మాస్టర్‌, మాథ్యూ థామస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

( ఇది చదవండి: ఒక్క నిమిషంలో 20 చీరలు.. ఆలియా అసలు ఎలా!?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement