నటుడు విజయ్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో చిత్రం అక్టోబర్ 19న విడుదలై మిక్సిడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా పలు రికార్డులు క్రియేట్ చేసింది. దీని తర్వాత రజనీకాంత్‌తో లోకేష్ ఒక సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. తలైవా 171 చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో లోకేష్ నిమగ్నమయ్యారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని కొన్ని వారాల క్రితం ప్రకటించారు.
లియో విడుదల తర్వాత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ పలు విషయాలను పంచుకున్నాడు. ఆరు నెలలపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని లోకేష్ నిర్ణయించుకున్నాడు. రజనీకాంత్‌తో తీయనున్న సినిమాకు పూర్తి సమయం కేటాయించాలని ఆయన ప్రకటించాడు. లియో గురించి సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు తెలిపిన ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఏప్రిల్‌లో తలైవా 171 ప్రారంభం కానుంది. ఆ సమయంలోనే మళ్లీ సోషల్ మీడియాకు కనెక్ట్ అవుతాడని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: వరణ్ తేజ్ పెళ్లికి సమంత, నాగచైత్యన్యతో పాటు మరో క్రేజీ హీరోయిన్)
అలాగే ‘లియో’ సినిమాకు కొందరు కావాలనే నెగెటివ్‌గా రివ్యూలు ఇచ్చారని ఆయన తెలిపాడు. లియో విడుదలైన రోజే కావాలని కొందరు యూట్యూబ్ ఛానల్స్ వారు నెగెటివ్ రివ్యూలు ఇచ్చినా.. కొందరు వాటిని కొట్టిపడేశారని చెప్పాడు. జర్నలిస్ట్‌లకు ఎప్పటికీ కృతజ్ఞలు చెప్పాలని ఆయన తెలిపాడు. నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రేక్షకులతో పాటు జర్నలిస్ట్‌లు కూడా ప్రధాన కారణమన్నారు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటా.. ఇకపై నా దృష్టి అంతా 'తలైవా171' మీదే ఉంటుందన్నారు. ఈ సినిమాకు రజనీకాంత్ నెగెటివ్ షేడ్ హైలైట్ కానుంది.' అని లోకేష్ చెప్పాడు.
రజనీ విలనిజం
రజనీకాంత్ విలనిజం అంటే తనకు ఇష్టమని, తలైవా 171లో ఆయన విలనిజంతో భయపెడుతానని లోకేష్ కనగరాజ్ అన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్న రజనీకాంత్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విలన్. తనకు విలన్‌గా నటించాలని ఉందని ఓ అవార్డు వేడుకలో ఆయనే పేర్కొన్నాడు. ఆ ఛాన్స్ ఈ సినిమాకు దక్కిందని లోకేష్ అన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమా టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు.
ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. దీని తర్వాత తలైవా 171 ప్రారంభం అవుతుంది. కథ ఇప్పటికే రెడీ చేసిన లోకేష్.. ఆరు నెలలు టైమ్ తీసుకుని మరింత స్ట్రాంగ్‌గా కథను తెరకెక్కించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
లోకేష్ కనగరాజ్‌పై లియో ఎఫెక్ట్
లోకేష్ కెరీర్లో ఎక్కువ నెగటివ్ తెచ్చుకున్న సినిమా లియో. ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద తప్పు ముందుగానే విడుదల తేదీ ప్రకటించడం. అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని స్క్రిప్టు, షూటింగ్ విషయంలో హడావుడి జరిగింది. దీంతో 'విక్రమ్' రిలీజైన కొన్ని రోజులకే లియోను ప్రారంభించాడు. షూటింగ్ కూడా హడావుడిగా చేశారని టాక్ ఉంది. రిలీజ్ డేట్ డెడ్ లైన్ ఉండటంతో ఆ ప్రెజర్ లియో రిజల్ట్ మీద పడింది. అందుకే ఈసారి లోకేష్ హడావుడి లేకుండా తలైవా విడుదల తేదీని ప్రకటించకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సరైన ప్లాన్‌తో తలైవా 171 చిత్రాన్ని తెరకెక్కించాలని ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment