మూవీ ఇండస్ట్రీలో ఒక్కో టైంలో ఒక్కో ట్రెండ్ నడుస‍్తుంటుంది. 'బాహుబలి' తర్వాత దాదాపు అన్ని భాషల్లో పీరియాడికల్ మూవీస్ తీశారు. కాకపోతే సక్సెస్ సాధించలేకపోయారు. 'మహానటి' ముందు, తర్వాత చాలామంది దర్శకులు బయోపిక్స్ తీసి హిట్స్ కొట్టారు. హారర్, థ్రిల్లర్ జానర్స్ కి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదంతా పక్కనబెడితే.. ప్రస్తుతం 10కి పైగా కొత్త సినిమాల్ని దాదాపు ఒకేలాంటి స్టోరీ లైన్ తో తీస్తున్నారని మీలో ఎంతమందికి తెలుసు?
ఆ సెంటిమెంట్
అమ్మనాన్న అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అవును మీలో కొందరు కరెక్ట్ గానే గెస్ చేశారు. అధికారికంగా బయటకు చెప్పనప్పటికీ.. నాన్న సెంటిమెంట్ తోనే తెలుగు, తమిళ, హిందీలో బోలెడన్ని మూవీస్ వస్తున్నాయి. వీటిలో తెలుగులో నుంచి వస్తున్న రీజనల్, పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ లుక్, వీడియో టీజర్స్ బట్టి చూస్తుంటే ఈ విషయం కచ్చితంగా ఇదే నిజమనిపిస్తోంది.
లిస్ట్ లో క్రేజీ మూవీస్
తెలుగులో ప్రస్తుతం తీస్తున్న భగవంత్ కేసరి, నాని 30, వెంకటేష్ 'సైంధవ్', ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', ఎన్టీఆర్ 'దేవర', రణ్ బీర్ కపూర్ 'యానిమల్', షారుక్ 'జవాన్', దళపతి విజయ్ 'లియో' సినిమాల్ని నాన్న సెంటిమెంట్ తోనే తీస్తున్నారట. స్టోరీ లైన్ ఈ సినిమాలన్నింటికీ వేర్వేరుగా ఉండొచ్చేమోగానీ మెయిన్ థీమ్ మాత్రం నాన్న సెంటిమెంట్ అని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే.. పైన చెప్పిన అన్ని సినిమాలు కూడా రాబోయే 8-9 నెలల్లోనే థియేటర్లలో రాబోతున్నాయి. ఫాదర్స్ డే సందర్భంగా ఈ విషయం వైరల్ కావడం విశేషం.
(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?)
Comments
Please login to add a commentAdd a comment