
వారసుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. విక్రమ్‌తో కమల్‌హాసన్‌కు భారీ విజయాన్ని అందించిన లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత విజయ్‌కి జోడీగా త్రిష నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. తమిళ్ ప్రేక్షకులే కాదు ఆలిండియా సినీ అభిమానులు సైతం లియో చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి కేరళలో బాయ్‌కాట్ సెగ తగిలింది
ట్రెండింగ్‌లో #KeralaBoycottLEO హ్యాష్‌ట్యాగ్
విజయ్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగు, కన్నడ, కేరళలో డబ్ అయి విజయం సాధించాయి. అందుకే లియో చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తున్నారు. కేరళలో కూడా విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేరళలో లియో సినిమాకు వ్యతిరేకత ఎదురవుతుంది. లియో సినిమాను బహిష్కరించాలంటూ కొంతమంది కేరళ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ వ్యతిరేకతను తెలియజేయడంతో.. #KeralaBoycottLEO హ్యాష్‌ట్యాగ్ ఎక్స్(ట్విటర్)లో ట్రెండ్ అవుతోంది. మోహన్‌లాల్ అభిమానులే ఈ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
కారణమేంటి?
పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న లియో సినిమాకు కేరళలో వ్యతిరేకత ఎదురవడానికి మోహన్‌లాల్ అభిమానులే కారణం. వాళ్లు అలా ట్రోల్ చేయడానికి కూడా కారణం ఉంది. 2014లో మోహన్‌లాల్, విజయ్ కలిసి ‘జిల్లా’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం విడుదలయ్యాక కొంతమంది విజయ్ ఫ్యాన్స్.. మోహన్‌లాల్ నటనను అవమానిస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్లో ఆ ట్వీట్స్ బాగా వైరల్ అయ్యాయి. తమ హీరోని అవమానించారు కాబట్టే.. విజయ్ సినిమాను ఇక్కడ ఆడనివ్వమని మోహల్‌లాల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విజయ్‌కి వ్యతిరేకంగా #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి బాయ్‌కాట్ హీట్ తగిలితే మాత్రం నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు.
Comments
Please login to add a commentAdd a comment