ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం లియో... అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో మాత్రం పర్వాలేదు అనిపించినా మిగిలిన అన్ని భాషల్లో అంతగా మెప్పించలేదు. కమల్ హాసన్‌తో 'విక్రమ్' సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తీసిన సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు పెరిగాయి. కానీ లియో సినిమా చూసిన తర్వాత చాలామంది నుంచి డివైడ్ టాక్ వచ్చింది.
లియో విడుదలైన రోజు నుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తుంది. సినిమా విడుదలైన రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇదంతా యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న పని అంటూ విజయ్ అభిమానులు ఫైర్ అయ్యారు. సినిమా విడదలైన రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 600 కోట్లుకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ ప్రకటిచారు. కానీ అందులో నిజం లేదని నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. రజనీకాంత్, అజిత్ ఫ్యాన్స్ కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం చేశారని విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
లియో విడుదలై ఇప్పటికే 5 వారాలు దాటింది. త్వరలో ఓటీటీలోకి రాబోతుందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ సినిమాను తమిళనాడులో రీ రిలీజ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. సుమారు 100 థియేటర్స్‌లలో లియోను మళ్లీ విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం గత రెండు వారులుగా తమిళనాట విడుదలైన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాల కోసం లియోను చాలా చోట్ల తొలగించేశారు. ఇప్పుడా సినిమాలు కూడా డిజాస్టర్ బాట పట్టడంతో థియేటర్లకు ప్రేక్షకులు కరవయ్యారు. దీంతో లియో సినిమాను రీరిలీజ్ చేస్తే మళ్లీ థియేటర్లు కలెక్షన్స్ బాట పట్టే ఛాన్స్ ఉందని వారు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment