విజయ్ 'లియో' మూవీ.. సామాన్యుడిలా తిరుమలకు డైరెక్టర్! | Leo Director Lokesh Kanagaraj Foot Walk To Tirumala; Video Viral - Sakshi
Sakshi News home page

Lokesh Kanagaraj: కాలినడకన తిరుమలకు లియో డైరెక్టర్.. వీడియో వైరల్!

Published Thu, Oct 12 2023 12:59 PM | Last Updated on Thu, Oct 12 2023 1:30 PM

Leo Director Lokesh Kanagaraj Foot Walk To Tirumala Video Viral - Sakshi

తమిళ స్టార్, దళపతి విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్ సర్జా‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌ఎస్‌ లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్‌ను పూర్తిచేసుకుని అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి సూపర్‌ రెస్పాన్స్ వచ్చింది. 

(ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్‌ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్‌ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!)

ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు డైరెక్టర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఓ సామాన్యుడిలా తిరుమలకు వెళ్లారు. శ్రీవారి మెట్లమార్గంలో కాలినడకన వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. లియో మూవీ సక్సెస్ కావాలని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాలినడక మార్గంలో ఇటీవల చిరుతల దాడి నేపథ్యంలో ఆయన చుట్టూ కర్రలు పట్టుకుని ఉన్న యువకులు రక్షణగా వెళ్లారు. కాగా.. ఈ చిత్రంపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement