ఈ శుక్రవారం తెలుగులో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో బాలయ్య 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కంటే విజయ్ 'లియో'కే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే హైప్, టికెట్ బుకింగ్స్ అవుతున్నాయి. మరోవైపు టైటిల్ మూలాన 'లియో' మూవీ తెలుగులో చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా లేదా అని మరో టెన్షన్.
ఇలా 'లియో' విషయంలో విడుదలకు సరిగ్గా రెండు రోజుల ముందు కాస్త హడావుడి ఎక్కువైంది. అయితే చాలామంది తెలుగు ఆడియెన్స్.. ఈ చిత్రాన్ని విజయ్ కోసం కాదు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కోసం చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 'విక్రమ్'తో మెస్మరైజ్ చేసిన ఇతడు.. 'లియో'తో ఏం మ్యాజిక్ చేయబోతున్నాడనేది ఇక్కడ ప్రశ్న.
(ఇదీ చదవండి: ‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ)
ఇకపోతే బడ్జెట్ పరంగా రూ.300 కోట్ల వరకు 'లియో' కోసం పెట్టారు. అయితే ఇందులో సగం బడ్జెట్ చిత్రబృందం రెమ్యునరేషన్ కోసం ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హీరో విజయ్ రూ.120 కోట్ల పారితోషికం అందుకున్నాడట. ఇతడి తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్-రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ రూ.10 కోట్లు, సంజయ్ దత్ రూ.8 కోట్లు, త్రిష రూ.5 కోట్లు, అర్జున్ రూ.కోటి, ప్రియా ఆనంద్ రూ.50 లక్షలు తీసుకున్నారట. సహాయ పాత్రల్లో నటించిన గౌతమ్ మేనన్, మిస్కిన్ తదితరులు రూ.30-50 లక్షల మధ్య రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.
కొన్నాళ్ల ముందు వరకు వేరే లెవల్ హైప్‌తో వార్తల్లో 'లియో' సినిమాకు ట్రైలర్ వచ్చిన తర్వాత కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయితే థియేటర్లలో సినిమా హిట్ అయితే మాత్రం ఈ సంగతులన్నీ ఫ్యాన్స్ మర్చిపోతారు. తెలుగు రిలీజ్ అక్టోబరు 19. అంటే మరో రోజు మాత్రమే గ్యాప్ ఉంది. మరి 'లియో' ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.
(ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment