తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’ తెలుగు వెర్షన్ విడుదలపై సిటీ సివిల్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. టైటిల్ వివాదం నేపథ్యంలో డి-స్టూడియోస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన సిటి సివిల్ కోర్టు.. ఈ నెల 20 వరకు లియో తెలుగు వెర్షన్‌ను విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై తెలుగు నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనుకున్న సమయానికే లియో విడుదల అవుతుందని స్పష్టం చేశాడు.
‘తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది.
(చదవండి: అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్.. లియోకు మరో బిగ్ షాక్!)
ఈ సినిమా తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించి ఉన్నారు. పైగా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్ ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి.. వాళ్ళకి గానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్యని పరిష్కరించుకుంటా’ అని నాగవంశీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment