హాలీవుడ్ నటుడు ఆడమ్ శాండ్లర్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో ఈ నెలలోనే ఓటీటీకి రానుంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ యానిమేషన్ చిత్రానికి రాబర్ట్ మరియానెట్టి, డేవిడ్ వాచెన్‌హీమ్, రాబర్ట్ స్మిగెల్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఒక బల్లి, తాబేలు ఓ పాఠశాలలో చిక్కుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో సినిమాలో హాలీవుడ్ నటుడు సెప్టాజినేరియన్ బల్లి పాత్రకు వాయిస్ అందించారు. ఆడమ్ శాండ్లర్ కథను అందించారు. మిగిలిన పాత్రలకు పలువురు హాలీవుడ్ నటులు వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ యానిమేషన్, హ్యాపీ మాడిసన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.
(ఇది చదవండి: నాగచైతన్య తొలి సిరీస్ 'దూత'.. ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్)
అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ రావడంతో ఇండియాలో ఫ్యాన్స్ అంతా దళపతి విజయ్ మూవీ అనుకుంటున్నారు. వాస్తవానికి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో మూవీ డేట్ ఇంకా వెల్లడించలేదు. మొదట ఈనెల 16న ఓటీటీకి రావొచ్చని భావించారు. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన లిస్ట్‌లో 21న లియో మూవీ ఉండడంతో అందరూ విజయ్ సినిమానేని భావిస్తున్నారు. కానీ అదే పేరుతో తెరకెక్కించిన హాలీవుడ్ యానిమేషన్ మూవీ లియో ఈనెల 21న స్ట్రీమింగ్ కానుంది.
November is for the crowning of heroes 👑🚂🔴🔵#WhatToWatch #NewOnNetflix #NetflixForAll pic.twitter.com/gDzrboSd0P
— Netflix India (@NetflixIndia) November 16, 2023
Comments
Please login to add a commentAdd a comment