Adam
-
ఓటీటీకి లియో.. రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ ఓ ట్విస్ట్!
హాలీవుడ్ నటుడు ఆడమ్ శాండ్లర్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో ఈ నెలలోనే ఓటీటీకి రానుంది. ఈనెల 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ యానిమేషన్ చిత్రానికి రాబర్ట్ మరియానెట్టి, డేవిడ్ వాచెన్హీమ్, రాబర్ట్ స్మిగెల్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఒక బల్లి, తాబేలు ఓ పాఠశాలలో చిక్కుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ లియో సినిమాలో హాలీవుడ్ నటుడు సెప్టాజినేరియన్ బల్లి పాత్రకు వాయిస్ అందించారు. ఆడమ్ శాండ్లర్ కథను అందించారు. మిగిలిన పాత్రలకు పలువురు హాలీవుడ్ నటులు వాయిస్ అందించారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ యానిమేషన్, హ్యాపీ మాడిసన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. (ఇది చదవండి: నాగచైతన్య తొలి సిరీస్ 'దూత'.. ఓటీటీలో అప్పటి నుంచే స్ట్రీమింగ్) అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ రావడంతో ఇండియాలో ఫ్యాన్స్ అంతా దళపతి విజయ్ మూవీ అనుకుంటున్నారు. వాస్తవానికి విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో మూవీ డేట్ ఇంకా వెల్లడించలేదు. మొదట ఈనెల 16న ఓటీటీకి రావొచ్చని భావించారు. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన లిస్ట్‌లో 21న లియో మూవీ ఉండడంతో అందరూ విజయ్ సినిమానేని భావిస్తున్నారు. కానీ అదే పేరుతో తెరకెక్కించిన హాలీవుడ్ యానిమేషన్ మూవీ లియో ఈనెల 21న స్ట్రీమింగ్ కానుంది. November is for the crowning of heroes 👑🚂🔴🔵#WhatToWatch #NewOnNetflix #NetflixForAll pic.twitter.com/gDzrboSd0P — Netflix India (@NetflixIndia) November 16, 2023 -
ఆడమ్ లిత్ సెంచరీ: ఇంగ్లండ్ 253/5
లీడ్స్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఎదురీదుతోంది. రెండో రోజు శనివారం తమ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు ఆడమ్ లిత్ (107; 15 ఫోర్లు) సెంచరీతో కెప్టెన్ కుక్ (75; 12 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టుకు శుభారంభం అందించినా... చివర్లో కివీస్ బౌలర్లు రెచ్చిపోయారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 88 ఓవర్లలో ఐదు వికెట్లకు 253 పరుగులు చేసింది. 70 పరుగుల వ్యవధిలోనే ఈ ఐదు వికెట్లు నేలకూలాయి. తొలి వికెట్‌కు ఓపెనర్లు 177 పరుగులు జత చేశారు. క్రీజులో బట్లర్ (6 బ్యాటింగ్) బెల్ (12 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గూచ్ (8,900) రికార్డును కుక్ అధిగమించాడు. అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. -
గీతాంజలి - 2014
హృదయం : ఇద్దరి ప్రేమకథ... క్యాన్సర్ నుంచి కోలుకుని మామూలు మనుషులైన యువతీయవకులకు నిర్వహించిన ఓ సదస్సులో లూసీ, ఆడమ్‌లకు పరిచయమైంది. రెండు గంటల ఆ సదస్సు చివర్లో ఆడమ్ ఫోన్ నెంబరు తీసుకుంది లూసీ. తర్వాత ఆమె అతనికి ఫోన్ చేసింది. ఆ ఫోన్ కాల్ నిడివి 5 గంటల 22 నిమిషాలు! ఆ కాల్ తర్వాత ఇక వేర్వేరుగా ఉండాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చేశారిద్దరూ. కొన్ని రోజుల్లోనే ఒక్కటైపోయారు. 22 ఏళ్ల ఆడమ్ ప్రస్తుతం తన చదువు కొనసాగిస్తుండగా.. 23 ఏళ్ల లూసీ హెమటాలజీలో క్లినికల్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తోంది. ఒకప్పుడు ఇద్దరి జీవితాల్లో కల్లోలం రేపిన క్యాన్సర్‌కు ఇద్దరూ ఇప్పుడు కృతజ్ఞతలు చెబుతున్నారు... ఎందుకంటే వాళ్లిద్దరినీ కలిపింది అదే! హీరోకు క్యాన్సర్... హీరోయిన్‌కు గుండె జబ్బు.. ఇద్దరూ ప్రేమించుకుంటారు.. చివరికి ఎంతకాలం బతుకుతారో తెలియని స్థితిలో ఒక్కటవుతారు. ఇదీ 1989 నాటి గీతాంజలి-ప్రకాష్‌ల ‘సినిమా’ ప్రేమకథ! ఆమెకు లుకేమియా.. అతనికి టెస్టికులర్ క్యాన్సర్.. మృత్యువుతో పోరాటం సాగించిన ఆ ఇద్దరూ ఓ క్యాన్సర్ సదస్సులో కలిశారు.. ఆ తర్వాత ప్రేమికులయ్యారు.. ఇపుడు కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇదీ 2014 నాటి లూసీ-ఆడమ్ల ‘నిజ జీవిత’ ప్రేమకథ. అమ్మాయి కథ హాయ్ నా పేరు లూసీ అండర్సన్ ఎడ్వర్డ్స్. మాది ఇంగ్లండ్‌లోని టెల్ఫోర్డ్. నా ప్రేమకథ గురించి చెప్పేముందు తొమ్మిదేళ్లు వెనక్కు వెళ్లాలి. అది 2005వ సంవత్సరం ఆగస్టు 22. ఆ తేదీని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. నా జీవిత గమనాన్నే మార్చేసిన రోజు అది. అందరు పిల్లల్లాగే చక్కగా స్కూలుకెళ్తూ ఆటపాటలతో సాగిపోతున్న నాకు ఆ రోజు విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఫ్లూ జ్వరం కూడా వచ్చింది. నన్ను ఓ ఆస్పత్రిలో చేర్చారు. కానీ అక్కడ ఒక్క రోజే ఉన్నా. మరుసటి రోజే నన్నో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు మార్చారు. రెండు రోజుల తర్వాత నాకు లుకేమియా అని చెప్పారు. ఒక్క క్షణం నా చుట్టూ ఉన్న ప్రపంచం కంపించిపోయింది. ఏడుపాగలేదు. అమ్మ ఓవైపు భోరున ఏడుస్తూనే నాకు ధైర్యం చెబుతోంది. నిబ్బరం తెచ్చుకున్నా. లుకేమియాతో పోరాడాలనుకున్నా. ఏడాదిపాటు హాస్పిటల్లోనే ఉన్నాను. చాలాసార్లు కీమో థెరపీ చేశారు. ఆ బాధ భరించడం కన్నా చచ్చిపోవడం మేలనిపించింది. అయినా ఓర్చుకున్నాను. మళ్లీ పుస్తకం పట్టి చదువు కొనసాగించే స్థితికి చేరుకున్నా. 2008 మార్చిలో నన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఐతే నేను తరచూ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవడం, క్యాన్సర్ అవగాహన సదస్సుకు హాజరు కావడం ఆపలేదు. అలా ఓ సదస్సులో పరిచయం అయ్యాడు ఆడమ్. అక్కడి నుంచి నా కొత్త జీవితం మొదలైంది. అబ్బాయి కథ... హలో.. నా పేరు ఆడమ్. నాది లూసీ అంతపెద్ద స్టోరీ కాదు. వయసులో ఆమె కంటే ఒక ఏడాదే చిన్నవాణ్ణి. లాంకాస్టర్ యూనివర్సిటీలో చక్కగా డిగ్రీ చదువుకుంటున్న నేను 2012 అక్టోబరులో ఓ భయానక రాత్రిని చూశాను. నా వృషణాలు విపరీతంగా నొప్పి పెట్టడంతో విలవిలలాడిపోయాను. మరుసటి రోజు నా ఫ్రెండుతో కలిసి ఆస్పత్రికి వెళ్లా. డాక్టర్ పరీక్షలన్నీ చేశాక... నీకు టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటూ నన్ను హతాశుడిని చేశాడు. కొన్ని క్షణాలు ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియలేదు. తర్వాత విపరీతంగా ఏడ్చాను. కానీ ఇలా ఏడ్చి ఏం లాభం లేదని, నవ్వుతూనే చికిత్స తీసుకోవాలని అనుకున్నా. నా పరిస్థితి తెలిసి సాకర్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ వచ్చి హాస్పిటల్లో కలిశాడు. ధైర్యం నూరిపోశాడు. వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. తొమ్మిది వారాల పాటు కీమోచేశారు. ఇంకో సర్జరీ కూడా చేశారు. మొత్తానికి నా శరీరంలో నుంచి క్యాన్సర్ కణాలన్నీ వెళ్లగొట్టి.. ఆరు నెలల తర్వాత నన్ను డిశ్చార్జి చేశారు. త తర్వాత 2013 జులైలో జరిగిన ఓ క్యాన్సర్ సదస్సులో లూసీ పరిచయం అయ్యింది. అది నా జీవితానికి మలుపు.