
హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లియో. వీరి కాంబినేషన్‌లో ఇంతకుముందు రూపొందిన మాస్టర్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తాజాగా మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే లోకేశ్ కనకగరాజ్ చివరి సినిమా విక్రమ్ ఘన విజయం సాధించింది. అటు విజయ్ నటించిన వారసుడు కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ సినిమాలతో జోరు మీదున్న ఇద్దరి కాంబినేషన్‌లో లియో రాబోతోంది.
త్రిష, ప్రియా ఆనంద్, నటుడు అర్జున్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, మన్సూర్ అలీఖాన్, దర్శకుడు మిష్కిన్, గౌతమ్ మీనన్, థ్యూ థామస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
ఇప్పటికే కాశ్మీర్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా లియో చిత్ర షూటింగ్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం వేసిన భారీ సెట్లో అర్జున్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది.. కాగా ఈ చిత్రంలో అర్జున్ గెటప్ కోసం ప్రత్యేకంగా ఇటీవల లుక్ టెస్ట్ చేసినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment