రజినీకాంత్ కూతురిగా ఛాన్స్‌ కొట్టేసిన స్టార్‌ హీరోయిన్‌ | Star Actor's Daughter Got Movie Chance With Rajinikanth | Sakshi
Sakshi News home page

రజినీకాంత్ కూతురిగా ఛాన్స్‌ కొట్టేసిన స్టార్‌ హీరోయిన్‌

Published Tue, Apr 16 2024 7:08 AM | Last Updated on Tue, Apr 16 2024 8:44 AM

Star Actor Daughter Movie Chance With Rajinikanth - Sakshi

సూపర్‌స్టార్‌ రజినీకాంత్ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలు శృతిహాసన్‌ నటించబోతున్నట్లు తాజా సమాచారం. రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో 'వేట్టైయాన్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కాగా దీని తరువాత తన 171వ చిత్రాన్ని లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో చేయనున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

అయితే ఈ నెల 22వ తేదీన చిత్ర టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ చెప్పారు. అలాగే ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ నెలలో ప్రారంభం కానుందన్నారు. కాగా తాజాగా ఇందులో రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్‌ నటించనున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. కోలీవుడ్‌లో సినీ దిగ్గజాలైన కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించి 25 ఏళ్లు అవుతోంది. అలాంటిది ఇప్పుడు కమల్ హాసన్ కూతురు రజినీకాంత్ తాజా చిత్రంలో ఆయనకు కూతురుగా నటించనున్నడం విశేషమే.

మరో విషయం ఏమిటంటే శృతిహాసన్‌ తమిళంలో నటించి చాలా కాలం అవుతోంది. లాభం చిత్రం తరువాత ఈమె ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కాగా సుమారు మూడేళ్ల తరువాత ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చిందన్న మాట. అయితే ఇటీవల ఈమె తన తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఇనిమేల్‌ అనే పాట ఆల్బమ్‌లో దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా శృతిహాసన్‌, రజినీకాంత్ 171 చిత్రంలో నటించే విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement