ఆ స్టార్ డైరెక్టర్‌కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా? | Guess The Celebrity: Director Lokesh Kanagaraj Sister Avantika Kanagaraj Interesting Details, Viral Pics - Sakshi
Sakshi News home page

Guess The Actress: హీరోయిన్ల కంటే అందంగా ఉంది.. కానీ హీరోయిన్ కాదు!

Oct 9 2023 7:37 PM | Updated on Oct 10 2023 4:07 PM

Director Lokesh Kanagaraj Sister Avantika Kanagaraj Details - Sakshi

హీరోయిన్లే అందంగా ఉంటారని మనందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఇండస్ట్రీలో హీరోల దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు ఆయా వ్యక్తులు కుటుంబ సభ్యుల్లోనూ హీరోయిన్లని మించి అందంగా ఉండేవాళ్లు ఉంటారు. వాళ్లకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం మరే కారణం తెలీదు గానీ స్క్రీన్‍‌పై కనిపించేందుకు ఇష్టపడరు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలాంటి బాపతే. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస‍్తున్న ఆ హిట్ మూవీ)

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అవంతిక కనగరాజ్. ఆ గుర్తొచ్చింది కదా! అవును మీరు ఊహించింది కరెక్టే. 'లియో' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కి ఈమె స్వయానా చెల్లి అవుతుంది. సినిమాపై రోజుకి రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. అలానే లోకేశ్ గురించి తెలుగు ప్రేక్షకులు కూడా తెగ మాట్లాడుకుంటున్నారు. అలా ఈమె ఫొటో బయటకొచ్చింది. ఆ తర్వాత మనోళ్లు ఊరుకోరుగా! ఎవరనేది ఆరా తీయడంతో ఆమె డీటైల్స్ తెలిసిపోయాయి.

ఇక అవంతిక విషయానికొస్తే.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత స్టూడెంట్ మార్కెటీర్‌గా రెండేళ్లకు పైగా పనిచేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చేసింది. టాలెంట్ మేనేజర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తోంది. తాజాగా ఈమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లోకేష్ కనగరాజ్‌కి ఇంత అందమైన చెల్లెలు ఉందని అందరికీ తెలిసింది. హీరోయిన్ల కంటే అందంగా ఉన్న ఈ బ్యూటీకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేకపోవడం  విశేషం.

(ఇదీ చదవండి: ఆ వార్తల వల్ల చాలా బాధపడ్డాను: మెగాస్టార్ చిరంజీవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement