సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక ప్రాజెక్ట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యింది. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్‌తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనిని అదునుగా మార్చుకున్న కొందరు తాజాగా రజనీకాంత్ పేరు చెప్పుకొని భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాగైన అవకాశాలను దక్కించుకోవాలని చాలామంది కోరికతో వస్తుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ తాజాగా బెంగళూరులో కొందరు స్కామ్‌కు పాల్పడ్డారు.
'తలైవర్ 171' సినిమాలో నటించడానికి ఆసక్తి ఉన్నవారు కావాలంటూ బెంగుళూరులో ఒక ఆడిషన్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి ఆడిషన్స్ ప్రకటనలు నెట్టింట చాలానే కనిపిస్తుంటాయి. కానీ రజనీకాంత్ సినిమా అనేసరికి చాలామంది ఆసక్తి చూపించారు. అలా ఆడిషన్స్‌కు వెళ్లినవారికి క్యాస్టింగ్ డైరెక్టర్స్ అంటూ కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. 'తలైవర్ 171 - కోడ్ రెడ్'లో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. మోసపోయిన వారిలో మృదుల అనే ఒక బాధితురాలు ఈ విషయాన్ని బయటపెట్టింది.
రజనీకాంత్ సినిమాలో నటించడం కోసం రూ.3.9 లక్షలను వారికి ఇచ్చినట్లు మృదుల తెలిపింది. రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ అనేసరికి డబ్బు ఇచ్చినట్లు ఆమె పేర్కొంది. ఈ స్కామ్‌కు లీడర్‌గా సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నట్లు తానే క్యాస్టింగ్ డైరెక్టర్‌గా ఆడిషన్స్‌కు వచ్చిన వారందరినీ పరిచయం చేసుకున్నాడని ఆమె చెప్పింది. సినిమా అవకాశాల పేరుతో మోసపోయిన మృదుల బెంగుళూరులోని సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. కేసును పోలీసులు విచారిస్తున్నారు .
Comments
Please login to add a commentAdd a comment