బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ కథ విషయమై ఇటీవల ఆమిర్ ఖాన్ , లోకేష్ పలుమార్లు చర్చించుకున్నారట. ప్రస్తుతం వీరిద్దరికి ఉన్న కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావచ్చని, 2026లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.
అంతేకాదు.. ఈ సినిమా సూపర్‌హీరో జానర్‌లో ఉంటుందట. మరి.. ఆమిర్, లోకేష్ కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment