కోలీవుడ్‌లో ప్రస్తుతం క్రేజీ దర్శకుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్. సినిమా ఆశతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి చిత్రరంగ ప్రవేశం చేసిన ఈయన తొలి చిత్రం మా నగరం నుంచి విక్రమ్ వరకు ఒకదాని మించిన ఒక హిట్ అందుకుంటూ వచ్చారు. తాజా విజయ్ కథానాయకుడిగా లియో చిత్రాన్ని పూర్తి చేశారు. ఈనెల 19వ తేదీన తెరపైకి రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
(ఇది చదవండి: ఎలిమినేషన్‌కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!)
ఈ మూవీ తర్వాత రజినీకాంత్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది దర్శకుల బాటలోనే లోకేష్ కనగరాజ్ కూడా నిర్మాతగా అవతారం ఎత్తుతున్నారు. ఈయన తన శిష్యుడు రత్నకుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రాఘవ లారెన్స్, నయనతార ప్రధాన పాత్రలో ఒక హారర్, థ్రిల్లర్ కథా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈచిత్రానికి లోకేష్ కనకరాజ్ కథ, కథనం బాధ్యతలను నిర్వహించనున్నట్లు తెలిసింది.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి నయనతార వైదొలగినట్లు తెలిసింది. ఇటీవలే జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నయనతార ఆ చిత్ర సంచలన విజయంతో భారతీయ సినిమాలో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. కాగా జయం రవి సరసన నటించిన ఇరైవన్ చిత్రం ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. తన 75వ చిత్రంతో పాటు టెస్ట్, మన్నాంగట్టి సీన్స్ 1960 పెదరా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
(ఇది చదవండి: నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి)
జవాన్ చిత్రం తర్వాత హిందీలోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. మరోపక్క తన సొంత నిర్మాణ సంస్థ రవి పిక్చర్స్ పతాకమైన చిత్రాలు నిర్మించడం డిస్ట్రిబ్యూషన్ చేయడం కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే ఇతర వ్యాపార రంగంలోనూ విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కొంత సమయాన్ని తన పిల్లల కోసం కేటాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ కనగరాజ్ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి అని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment