లేడీ సూపర్‌స్టార్ నయనతార చిత్రంమంటే కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న చిత్రం అన్నపూరణి. ఈ చిత్రం ద్వారా నీలేష్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఒకటో తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ సంబంధించిన విశేషాలను దర్శకుడు పంచుకున్నారు.
చిన్న వయస్సులోనే వంటలపై ఆసక్తి కలిగిన ఒక యువతి ఎలా ఆ రంగంలో విజయం సాధించింది అన్నదే అన్నపూరణి చిత్రమని దర్శకుడు నీలేష్ కృష్ణ తెలిపారు. ఆమె తన కుటుంబం, వారి సామాజికవర్గం పురుషాధిక్యతను ఎదుర్కొని ఎలా తన లక్ష్యాన్ని చేరుకుందన్నదే కథగా తెరకెక్కించినట్లు పేర్కొన్నారు. ఈ కథను కొన్నేళ్ల కిత్రమే నయనతారకు వినిపించారన్నారు. ఆమె ఆ సమయంలో యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ కథా చిత్రాలు అధికంగా చేస్తున్నారని.. ఈ కథ వాటికి భిన్నంగా ఉందని చెప్పి నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారన్నారు.
అయితే ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే చిత్రంలో నటించగలనని, అంతవరకు వేచి చూడగలరా అని అడిగారన్నారు. అలా నయనతార కోసం ఎదురుచూసి ఈ చిత్రాన్ని పూర్తి చేశామని చెప్పారు. మానవత్వం, ప్రేమ, ఆత్మవిశ్వాసం గురించి చెప్పే చిత్రంగా అన్నపూరిణి కథా చిత్రం ఉంటుందన్నారు. ఇది నయనతార ఇంతకుముందు నటించిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. అంతే కాకుండా నలభీముల గౌరవాన్ని పెంచే చిత్రంగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, జయ్, కేఎస్ రవికుమార్, కుమారి సచ్చు, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లీ, రేణుక, కార్తీక్ కుమార్, సురేష్ చక్రవర్తి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment