కోలీవుడ్ నటుడు ధనుష్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటించనున్నారని కోలివుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌కు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. రేర్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రానున్నడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. కోలీవుడ్‌లో మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి భారీ చిత్రాలను తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా లోకేశ్ కనకరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా కూలీ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు.
తరువాత కార్తీ హీరోగా ఖైదీ–2తోపాటు మరో రెండు చిత్రాలు కమిట్ అయ్యారు. కాగా నటుడు ధనుష్ విషయానికి వస్తే ఇటీవల కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అదేవిధంగా తమిళంలో పాటు, తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లోనూ కథానాయకుడిగా నటిస్తూ వరల్డ్ స్టార్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. అదేవిధంగా ఈయన దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
ఇక తెలుగులో హీరోగా నటిస్తున్న కుబేర చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలా మరిన్ని చిత్రాల్లో ధనుష్ నటించనున్నారు. తాజాగా ఈయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోకేశ్ కనకరాజ్ నటుడు ధనుష్‌ను కలిసి కథను వినిపించినట్లు, అది ఆయనకు నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ కాంబినేషనల్ తెరకెక్కనున్న చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ధనుష్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం కమిటైన చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీరి కాంబోలో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment