
కోలీవుడ్‌లో వరుస హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్.. ఆయన నుంచి సినిమా ప్రకటన వచ్చిందంటే చాలు భారీగా అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలో ఖైదీ, విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ క్రియేట్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.
తాజాగా లోకేష్ కనగరాజ్ కొత్త సినిమాను ప్రకటించాడు. దానికి టైటిల్ కూడా 'బెంజ్' అని ఫిక్స్ చేశాడు. అందులో రాఘవ లారెన్స్ హీరోగా నటుస్తున్నాడు. అయితే ఈ క్రేజీ సినిమాను లోకేష్ డైరెక్ట్ చేయడం లేదు. కేవలం కథను మాత్రమే అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని బక్యరాజ్ కన్నన్ (రెమో) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట.. లోకేష్ డైరెక్ట్ చేసిన ఖైదీ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ఉండదు అనే విషయం తెలిసిందే.
రాఘవ లారెన్స్ నుంచి మరో సినిమా ప్రకటన కూడా తాజాగా వెలువడింది. హంటర్ అనే టైటిల్‌తో ఒక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోలీవుడ్‌లో కత్తి సినిమాను డైరెక్ట్ చేసిన వెంకట్ మోహన్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. కత్తి సినిమా తెలుగులో ఖైదీ 150 పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. హంటర్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment