Sathyam Sundaram Movie
-
థియేటర్స్ లో ఫ్లాప్.. ఓటీటీలో బిగ్ సక్సెస్..!
-
దేవరతో రిలీజ్ అవ్వడం వల్లే సత్యం సుందరం కి కష్టాలు...
-
సుతిమెత్తగా అభిమానులకు క్లాస్ పీకిన సూర్య
ఒకప్పుడు సినిమా 50, 100 రోజుల పాటు థియేటర్లలో ఆడేది. దానిబట్టి హిట్టా ఫ్లాప్ అనేది నిర్ణయించేవాళ్లు. కానీ ఇప్పుడు సినిమా ఎలా ఉన్నా సంబంధం లేదు. కోట్లకు కోట్లు వచ్చాయా.. మా మూవీ హిట్ అయిపోయిందో అని నిర్మాతలు చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడంతా వసూళ్ల బట్టే ఫలితాన్ని నిర్ణయిస్తున్నారు. ఫ్యాన్స్ గొడవలు పడేది కూడా ఈ వసూళ్ల గురించే.మా హీరో సినిమాకు తొలిరోజు ఇన్ని కోట్లు వచ్చాయని ఒకడంటే.. మా హీరో చిత్రానికి తొలిరోజు మీ వాడికంటే ఎక్కువనే వచ్చాయని మరో ఫ్యాన్ అంటాడు. ఇలాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి అభిమానులపై తమిళ హీరో సూర్య కౌంటర్లు వేశాడు. మూవీకి వచ్చే కలెక్షన్స్ గురించి మీకెందుకు అని అడిగాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మెయిళగన్'. సూర్య-జ్యోతిక నిర్మించారు. తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో థియేటరలో రిలీజ్ చేస్తున్నారు. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా తమిళనాడులో జరిగింది. ఇందులో మాట్లాడిన సూర్య.. 'సినిమాలోని స్టోరీ, కంటెంట్, పాత్రల గురించి మాట్లాడుకోండి. వాటి గురించి సెలబ్రేట్ చేసుకోండి. వసూళ్ల గురించి మీకు(ఫ్యాన్స్) ఎందుకు? వాటి గురించి ఆలోచించడం ఆపండి' అని చెప్పాడు.వసూళ్ల గురించి ఫ్యాన్స్ గొడవ పడుతుంటారని దాదాపు అందరు హీరోలకు తెలుసు. కానీ ఏ ఒక్కరూ దాని గురించి మాట్లాడరు. సూర్య మాత్రం మరీ కొట్టినట్లు చెప్పనప్పటికీ చెప్పాల్సిన విషయాన్ని అయితే చెప్పాడు. మరి దీన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?)This is to all the fans who fight day in and day out about the Box Office numbers. pic.twitter.com/YPqdDAi6wb— Aakashavaani (@TheAakashavaani) September 23, 2024 -
తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!
తమిళ దర్శకనిర్మాతలకు తెలుగు ప్రేక్షకులంటే మరీ అలుసు. బయటకు ఆహా ఓహో అని చెబుతారు. కానీ సినిమాల్లో కథ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతి దానిలోనూ తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమాకు పెట్టే పేరు దగ్గర నుంచి డబ్బింగ్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్లు. కానీ రీసెంట్ టైంలో ఆ పద్ధతి పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తీ తన కొత్త మూవీతో తెలుగు ఆడియెన్స్‌కి కాస్త గౌరవం ఇస్తున్నాడా అనిపిస్తుంది.రీసెంట్ టైంలో తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగులోనే చాలానే రిలీజయ్యాయి. వీటిలో అయలాన్, బాక్, రాయన్, తంగలాన్ ఉన్నాయి. ఈ టైటిల్‌కి అర్థం ఏంటంటే ఒక్కడూ చెప్పలేడు. తమిళంలో ఏదైతే పెట్టారే దాన్ని యధాతథంగా అనువదించేశారు. ఏ పేరు పెట్టినా తెలుగు ప్రేక్షకుడు చూస్తాడులే అని అలుసు కావొచ్చు. త్వరలో రిలీజయ్యే రజనీకాంత్ 'వేట్టయాన్', సూర్య 'కంగువ' సినిమాలది కూడా ఇదే తీరు.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)ఇకపోతే కార్తీ లేటెస్ట్ తమిళ మూవీ 'మైళగన్'. తమిళనాడులోని తంజావుర్‌లో ఓ రాత్రి ఇద్దరు వ్యక్తులు (బావ-బావమరిది) మధ్య జరిగిన స్టోరీతో దీన్ని తీశారు. తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. తమిళ పేరుని ఉన్నది ఉన్నట్లు కాకుండా 'సత్యం సుందరం' అని టైటిల్ పెట్టారు. ఉద్దండరాయుని పాలెం ఊరిలో కథని జరిగినట్లు చూపించారు. ఊరి పేర్లతో సహా బండి నంబర్ ప్లేట్ల విషయంలో టీమ్ కాస్త శ్రద్ధ తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇవన్నీ అర్థమవుతున్నాయి.అయితే ఈ సినిమా ఎన్టీఆర్ 'దేవర' సినిమా రిలీజైన ఒకరోజు తర్వాత అంటే సెప్టెంబరు 28న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీ తీసే సినిమాలు అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంటాయి. అయితే 'దేవర'తో పోటీగా వస్తున్నాడు. ఏం చేస్తాడో చూడాలి? సరే ఇదంతా పక్కనబెడితే తమిళ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇప్పటికైనా కాస్త టైటిల్స్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే బెటర్!(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)