.7...7...7 వస్తున్నాడీ ఖాకి! | Karthi Khakee movie teaser this month of 27 | Sakshi
Sakshi News home page

.7...7...7 వస్తున్నాడీ ఖాకి!

Published Mon, Sep 25 2017 1:19 AM | Last Updated on Mon, Sep 25 2017 1:19 AM

Karthi Khakee movie teaser this month of 27

ఈ నెల 27న టీజర్‌తో, వచ్చే నెల (అక్టోబర్‌) 17న ట్రైలర్‌తో, నవంబర్‌ 17న సినిమాతో వస్తున్నాడీ ‘ఖాకి’. ఈ సెవెన్‌ సెంటిమెంట్‌ ఏంటో మరి!? మధ్యలో పాటలతోనూ ఓసారి వస్తాడు. అదెప్పుడనేది త్వరలో తెలుస్తుంది. కార్తీ, రకుల్‌ జంటగా నటించిన తమిళ సినిమా ‘ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు’. హెచ్‌. వినోద్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఖాకి’గా తీసుకొస్తున్నారు ‘ఆదిత్యా మ్యూజిక్‌’ అధినేత ఉమేశ్‌ గుప్తా. ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌... అనేది ఉపశీర్షిక.

ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ– ‘‘2005లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. పవర్‌ఫుల్‌ పోలీస్‌గా కార్తీ నటన, ఆయన ఫిజిక్‌ సిన్మాకి హైలైట్స్‌గా నిలుస్తాయి. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలని రైట్స్‌ తీసుకున్నాం. జిబ్రాన్‌ మంచి పాటలతో పాటు రీ–రికార్డింగ్‌ను అద్భుతంగా చేస్తున్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement