‘‘నేనెప్పుడూ పోటీ ఫీలవ్వలేదు. ఈ సినిమా నేను చేయకుండా.. వేరే పర్సన్ చేస్తే వాళ్లకి పేరొస్తుందన్న ఐడియా రాంగ్. అలా కాంప్రమైజ్ అయి, కమిట్ అయితే సినిమా ఫ్లాప్ అవ్వొచ్చు. స్క్రిప్ట్ నచ్చితేనే ఓకే చేస్తాను’’ అన్నారు రకుల్ ప్రీత్‌సింగ్. హెచ్. వినోద్ దర్శకత్వంలో కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా తమిళంలో రూపొందిన చిత్రం ‘ధీరమ్ అధిగారమ్ ఒండ్రు’. ఈ సినిమాని ‘ఖాకి’ పేరుతో ‘ఆదిత్య’ ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా వారితో రకుల్ చెప్పిన విశేషాలు.
► ‘ఈ సినిమాలో మీది హౌస్‌వైఫ్ క్యారెక్టర్’ అని దర్శకుడు వినోద్ అన్నప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. స్క్రిప్ట్ విన్నాక ఎగై్జట్ అయ్యాను. చాలా రీసెర్చ్ చేసి, ఈ సినిమా తీశారు. రొమాంటిక్ సీన్స్‌ను డైరెక్టర్ బాగా తీశారు. కార్తీ మంచి వ్యక్తి మాత్రమే కాదు.. హార్డ్‌వర్కర్ కూడా.
► ఈ సినిమా చేశాను కాబట్టి పోలీసాఫీర్‌లపై గౌరవం పెరిగిందని కాదు.. నాకు మొదట్నుంచే అపారమైన గౌరవం ఉంది. రీల్ లైఫ్‌లో యాక్షన్.. కట్ ఉండవు. కానీ, రియల్ లైఫ్‌లో ఉండవు. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ మాది. సైనికులు బోర్డర్ వద్ద ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నాన్నగారు రాజస్తాన్ బోర్డర్‌లో వర్క్ చేసినప్పుడు నేను కూడా బంగర్‌లో ఫోర్, ఫైవ్ డేస్ ఉన్నాను. గన్‌ఫైరింగ్ చుశాను. సో..నాకు డిఫెన్స్ డిపార్ట్‌మెంట్స్ అంటే చాలా ఇష్టం.
► నా గురించి వచ్చే గాసిప్స్‌ని నేనంతగా పట్టించుకోను. కొంచెం రెస్ట్ కోసం నేను గ్యాప్ తీసుకున్నాననుకోండి.. చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంది అంటారు. నాకు క్వాంటిటీ కాదు. క్వాలిటీ ముఖ్యం. స్క్రిప్ట్ నచ్చితే సినిమాను వదులుకోను. అవసరమైతే డే అండ్ నైట్ వర్క్ చేస్తాను. ‘రారండోయ్..’ సినిమా టైమ్‌లో ఫోర్ మంత్స్ డేట్స్ ఖాళీగా లేవు. మిగతా సినిమాలకు కష్టపడి డేట్స్ అడ్జెట్ చేసుకున్నాను.
► హిందీలో ‘అయ్యారి’ అనే సినిమాలో చేస్తున్నా. తమిళంలో రెండు సినిమాలు చేయబోతున్నాను. తెలుగులో మరో రెండు సినిమాలు ఉన్నాయి. మహేశ్‌బాబు, సూర్య సినిమాల్లో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యారంటగా అన్న ప్రశ్నకు.. డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఓకే అవ్వగానే చెబుతా.
► సెక్స్‌వల్ అబ్యూజింగ్ మీద డిఫరెంట్ ఓపీనియన్ ఏముంటుంది. దేశంలో రేప్స్ జరుగుతున్నాయి. లైంగిక వేధింపులకు ఫుల్‌స్టాప్ పడటం లేదు. ‘కోర్టులో కేసు చాలా రోజులు సాగుతుంది. ఏదో ఒకటి చేసి బయటికి వచ్చేయొచ్చు’ అని దోషులు అనుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలను ఆపాలంటే కఠినమైన చట్టాలను రూపొందించి అమలు చేయాలి. మహిళలను వేధించిన వారి ఫేస్‌ను టీవీల్లో కవర్ చేయకూడదు. అందరికీ చూపించాలి. పబ్లిక్‌లో శిక్షించాలి. దోషులకు శిక్షలు విధిస్తే భవిష్యత్‌లో ఇంకొందరు మహిళల జీవితాలు నాశనం అవ్వవు. అదే అరబ్ కంట్రీస్‌లో అయితే చేతులు నరికేస్తారు.
► సినిమా ఫీల్డ్‌లో లైంగిక వేధింపులు ఉంటాయని చాలామంది చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి నేను కూడా వింటున్నాను. వేధించే వారు ఉంటారో లేదో నాకు తెలీదు. కానీ, నా లైఫ్‌లో ఇంతవరకు అలాంటి సమస్యను ఎదుర్కోలేదు. కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో మీడియా ఇంటరాక్షన్ ఉంది కాబట్టి మేం మాట్లాడగలుతున్నాం. అదే కొన్ని ఆఫీసుల్లో మహిళల బాధలను ఎవరు పట్టించుకుంటారు? వారి ఇంటర్వ్యూస్‌ను ఎవరూ తీసుకోరు కదా?
అందరూ నయనతార అవుదామనుకుంటే కుదరదు
నయనతారకు, నాకు చాలా తేడా ఉంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలైంది. సినిమాను ఆమె ఒకత్తే ముందుకు తీసుకెళ్లగలదు. అందరూ నయనతార అవుదామనుకుంటే కుదరదు. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేయాలంటే అనుభవం రావాలి. టైమ్ పడుతుంది. నేను ఇంకా డిఫరెంట్ రోల్స్ చేయాలి. ఇండస్ట్రీలో చాలా దూరం ముందుకెళ్లాలి. అప్పుడు తప్పకుండా లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రయత్నిస్తాను. నయనతార నటించిన ‘ఆరమ్’ సినిమా ఇంకా చూడలేదు. తెలుగులో రిలీజ్ అయితే తప్పకుండా చూస్తాను.
అవసరమైతే డే అండ్ నైట్ వర్క్ చేస్తా!
Published Sat, Nov 18 2017 11:59 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment