‘‘డ్రెస్‌లో ఉండే పోలీసులను చూసి చిన్నప్పటి నుంచి సూపర్‌మేన్స్ అనుకునేవాణ్ణి. కానీ, ‘ఖాకి’ సినిమా చేశాక వారి కష్టం ఏంటో తెలిసింది. అప్పటి నుంచి వారిని సోదరుల్లా భావిస్తున్నా’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా వినోద్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ తమిళంలో నిర్మించిన చిత్రం ‘ధీరన్ అధికారం ఒండ్రు’. ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ‘ఖాకి’ పేరుతో ఈ శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ– ‘‘తమిళనాడులో జరిగిన ట్రూ స్టోరీ ఇది. ఈ కథ కోసం దర్శకుడు రెండేళ్లు రీసెర్చ్ చేశారు. క్రైమ్ రీసెర్చ్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. పదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనలో ఎటువంటి సాక్ష్యాలు ఉండవు. ఆ నేరంలోని నిందితులను ఆంధ్ర, తమిళనాడు, రాజస్థాన్ పోలీసుల సహాయంతో ఎలా పట్టుకున్నారన్నదే కథ.
ఒక రోజుకి మనం మామూలుగా ఎనిమిది నుంచి పన్నెండు గంటలు కష్టపడతాం. మా రీసెర్చ్‌లో పోలీసులు ఇరవై రెండు గంటలు కష్టపడతారని తెలిసి ఆశ్చర్యపోయా. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రమిది. బ్యూటిఫుల్ ఎమోషన్ కూడా ఉంటుంది. ఈ చిత్రంలో కొత్త రకుల్‌ని చూస్తారు. ఎంతో మోడ్రన్‌గా ఉండే తను ఇల్లాలిగా సెట్ అవుతుందా? అనుకున్నాం. కానీ, తను చాలా బాగా చేసింది. ఈ చిత్రంలో నేను డీఎస్పీ పాత్ర చేశా. డ్యూటీలో ఎంత సీరియస్‌గా ఉన్నా ఇంటికి రాగానే భార్యతో కూల్ కూల్‌గా ఉంటాను’’ అన్నారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. కార్తీ ఈ చిత్రం కోసం బాగా కష్టపడ్డారు. కార్తీ, రకుల్ బ్యూటిఫుల్ జోడీ. ‘ఖాకి’ తెలుగులో మంచి హిట్ అవుతుందని మేము, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు నిర్మాత ఉమేష్ గుప్తా. రకుల్‌ప్రీత్ సింగ్, సహ నిర్మాత శ్రీధర్‌రెడ్డి, నటుడు నర్రా శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment