మరోసారి ‘ఖాకీ’ జోడి | Rakul Preet Singh and Karthi to team up again | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 19 2018 1:37 PM | Last Updated on Fri, Jan 19 2018 1:37 PM

Rakul Preet Singh and Karthi to team up again - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు కోలీవుడ్‌ లో బిజీ అవుతోంది. మురుగదాస్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం స్పైడర్‌లో నటించే అవకాశం రావడంతో తమిళంలో పాగా ఖాయం అనే నిర్ణయానికి వచ్చేసింది. ఈ చిత్ర నిర్మాణంలోనే విజయ్, సూర్య, కార్తీలతో నటించే అవకాశాలు చుట్టుముట్టి రకుల్‌ను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే స్పైడర్‌ పరాజయం ఈ అమ్మడి ఆశలపై నీళ్లు చల్లింది. అంతేకాదు విజయ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం చేజారింది. సూర్య చిత్రంలోనూ రకుల్‌ను తొలగించారనే ప్రచారం జోరందుకుంది. దీంతో పూర్తిగా డీలా పడిపోయిన రకుల్‌కు కార్తీతో జతకట్టిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాదు సూర్యకు జంటగా నటించే అవకాశం తిరిగి రకుల్‌ చెంతకు చేరింది. 

ఇక బాలీవుడ్‌లోనూ రెండో అవకాశాన్ని చేజిక్కించుకుంది. రకుల్‌ ప్రస్తుతం హిందీలో నటిస్తున్న ఆయ్యారీ చిత్రం ఫిబ్రవరిలో తెరపైకి రానుంది. ఈ స్థితిలో అజయ్‌దేవ్‌గన్‌తో జత కట్టే మరో లక్కీచాన్స్‌ రకుల్‌ తలుపు తట్టింది. ఇలా మళ్లీ హ్యాపీ మూడ్‌లోకి వచ్చేసిన ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో మరో అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. ధీరన్‌ అధికారం ఒండ్రుతో విజయానందాన్ని పంచిన నటుడు కార్తీతో మరోసారి రొమాన్స్‌ చేసే అవకాశం రకుల్‌ను వరించిందట. కార్తీ ప్రస్తుతం పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య నిర్మిస్తున్న కడైకుట్టి సింగం చిత్రంలో నటిస్తున్నారు. ఈయన తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారట. రజత్‌ దర్శకత్వం వహించినున్న ఇందులో కార్తీకు జంటగా నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని లక్ష్మణ్‌ నిర్మించనున్నారు. హారీష్‌ జయరాజ్‌ సంగీతబాణీలు కట్టనున్నారని కోటీవుడ్‌ వర్గాల సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement