Dheeran adhikaram ondru
-
యంగ్ డైరెక్టర్‌తో అజిత్ కొత్త సినిమా
కోలీవుడ్ టాప్ హీరో అజిత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వాసం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించిన అజిత్, శివలు విశ్వాసంతో మరో హిట్ మీద కన్నేశారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండా అజిత్ తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం అజిత్ తన తదుపరి చిత్రాన్ని ఓ యువ దర్శకుడితో చేయనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. శతురంగ వెట్టై, శతురంగ వెట్టై 2, ధీరన్ అధిగరం ఒండ్రు సినిమాలతో సత్తా చాటిన యువ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించేందుకు అజిత్ అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వినోద్ తన తొలి సినిమా రిలీజ్ తరువాత అజిత్ తో సినిమా చేసేందుకు ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు మరోసారి అజిత్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు విజయ్ 63వ సినిమాకు కూడా వినోద్ దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. -
మరోసారి ‘ఖాకీ’ జోడి
రకుల్‌ప్రీత్ సింగ్‌కు కోలీవుడ్ లో బిజీ అవుతోంది. మురుగదాస్ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం స్పైడర్‌లో నటించే అవకాశం రావడంతో తమిళంలో పాగా ఖాయం అనే నిర్ణయానికి వచ్చేసింది. ఈ చిత్ర నిర్మాణంలోనే విజయ్, సూర్య, కార్తీలతో నటించే అవకాశాలు చుట్టుముట్టి రకుల్‌ను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే స్పైడర్ పరాజయం ఈ అమ్మడి ఆశలపై నీళ్లు చల్లింది. అంతేకాదు విజయ్‌తో రొమాన్స్ చేసే అవకాశం చేజారింది. సూర్య చిత్రంలోనూ రకుల్‌ను తొలగించారనే ప్రచారం జోరందుకుంది. దీంతో పూర్తిగా డీలా పడిపోయిన రకుల్‌కు కార్తీతో జతకట్టిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అంతేకాదు సూర్యకు జంటగా నటించే అవకాశం తిరిగి రకుల్ చెంతకు చేరింది. ఇక బాలీవుడ్‌లోనూ రెండో అవకాశాన్ని చేజిక్కించుకుంది. రకుల్ ప్రస్తుతం హిందీలో నటిస్తున్న ఆయ్యారీ చిత్రం ఫిబ్రవరిలో తెరపైకి రానుంది. ఈ స్థితిలో అజయ్‌దేవ్‌గన్‌తో జత కట్టే మరో లక్కీచాన్స్ రకుల్ తలుపు తట్టింది. ఇలా మళ్లీ హ్యాపీ మూడ్‌లోకి వచ్చేసిన ఈ బ్యూటీకి కోలీవుడ్‌లో మరో అవకాశం వరించిందన్నది తాజా సమాచారం. ధీరన్ అధికారం ఒండ్రుతో విజయానందాన్ని పంచిన నటుడు కార్తీతో మరోసారి రొమాన్స్ చేసే అవకాశం రకుల్‌ను వరించిందట. కార్తీ ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నిర్మిస్తున్న కడైకుట్టి సింగం చిత్రంలో నటిస్తున్నారు. ఈయన తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. రజత్ దర్శకత్వం వహించినున్న ఇందులో కార్తీకు జంటగా నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని లక్ష్మణ్ నిర్మించనున్నారు. హారీష్ జయరాజ్ సంగీతబాణీలు కట్టనున్నారని కోటీవుడ్ వర్గాల సమాచారం. -
చిన్న సినిమాకు సూపర్‌స్టార్ ప్రశంసలు
తమిళ సినిమా: ఎవరినైనా ప్రశంసించాలంటే చాలా పెద్ద మనసు కావాలి. అదే విధంగా రజనీకాంత్ లాంటి సూపర్‌స్టార్ నుంచి అభినందనలు అందుకోవాలంటే వారు ఎంతో ప్రతిభను చాటు కోవాల్సి ఉంటుంది. అలాంటి అభినందనలను నవ దర్శక, కథానాయికలు పొందగలిగారు. వారే అరువి చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు పురుషోత్తమన్, ఆ చిత్ర కథానాయకి అతిధిబాలన్. పలు భారీ చిత్రాలను నిర్మించిన డ్రీమ్‌వారియర్ ఫిలింస్ అధినేతలు ఎస్ఆర్.ప్రకాశ్, ఎస్ఆర్.ప్రభు నిర్మించిన తాజా చిత్రం అరువి. పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన అరువి చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణను విశేషంగా పొందుతోంది.ఇక చిత్ర ప్రముఖులు ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం చూసి ఫోన్లోనే చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు పురుషోత్మమన్ను అభినందించారు.తాజాగా ఇటీవల మరోసారి అరువి సినిమా చూసిన రజనీకాంత్ ఆ చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రభు, కథానాయకి అతిధిబాలన్లను ఇంటికి పిలిపించి ప్రశంసలలో ముంచెత్తడంతో పాటు బంగారు గొలుసులను బహూకరించారు. ఈ సందర్భంగా అరువి చిత్ర నిర్మాత ఎస్ఆర్.ప్రభును మీరు ఇంతకు ముందు నిర్మించిన చిత్రాలేమిటని అడిగారు. జాతీయ అవార్డును గెలుచుకున్న జోకర్, మానగరం, ధీరన్ అధికారం ఒండ్రు లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించినట్లు నిర్మాత చెప్పడంతో మీ చిత్రాలన్నీ తాను చూశానని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి చిత్రాలు నిర్మించాలని అభినందించారు. దర్శకుడిని ఉద్దేశించి బ్రిలియంట్, ఎక్స్లెంట్, ట్రెమండస్ చిత్రం అరువి అని ప్రశంసించారు.ఈ చిత్ర కథను ఎక్కడ నుంచి మొదలెట్టారని అడిగారు. తానీ చిత్రాన్ని తన ఇంట్లో ఒంటరిగా చూశానని, అయినా ప్రేక్షకుల మధ్య చూసినంత అనుభూతి కలిగిందని అన్నారు. ఎంతగా ఏడ్చేశానో, ఇంకెంతగా నవ్వుకున్నానో అని అన్నారు.ఇక హీరోయిన్ అతిధిబాలన్ అద్భుతంగా అభినయించారని అభినందించారు. ఇలాంటి టీమ్ పది కాలాల పాటు పరిశ్రమలో ఉండాలని ఆకాంక్షిస్తూ అభినందించారు.రజనీ అభినందనలకు అరువి చిత్ర దర్శక నిర్మాతలు, కథానాయకి పులకించిపోయారు. -
ముఖ్యంగా ఆ మూడు ఉండాలి
తమిళసినిమా: ముఖ్యం గా ఆ మూడు అంశాలు ఉండాలనుకున్నాను అని అన్నారు దర్శకుడు హెచ్.వినోద్. చతురంగవేట్టై చిత్రం ద్వారా దర్శకుడిగా పరి చయం అయ్యి తొలి చి త్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన తాజాగా కార్తీ కథానాయకుడిగా ధీరన్ అధికారం ఒండ్రు చిత్రాన్ని తెరకెక్కించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతలు ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభుల తాజా చిత్రం ఇది. నటి రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం, సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం అందించారు. కాగా ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 17న తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగులో ఖాకి పేరుతో తెరపైకి రానున్న ఈ చిత్ర వివరాలను తెలియజేయడానికి చిత్ర యూనిట్ గురువారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జిబ్రాన్ మాట్లాడుతూ తాను సంగీతాన్ని అందించిన పూర్తి కమర్షియల్ కథా చిత్రం అధికారం ఒండ్రు అని పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు వినోద్ మాట్లాడుతూ ఇది పక్కా కమర్షియల్ చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్రంలో ముఖ్యంగా ఎంటర్టెయిన్మెంట్, ఎడ్యుకేషన్, ఎంగేజ్ మొదలగు మూడు అంశాలు ఉండాలని తాను భావించానని, వాటిని చిత్రంలో సరిగా పొందుపరచాననే అనుకుంటున్నానని అన్నారు. చాలా నేర్చుకున్నా.. చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ ఈ చిత్రంతో తాను చాలా నేర్చుకున్నానని అన్నారు. ఇంతకు ముందు చిరుతై చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో నటించానని, మళ్లీ ఈ చిత్రంలో అలాంటి పాత్ర చేయాల్సి రావడంతో పలువురు పోలీస్ అధికారులను కలిసి వారి వద్ద శిక్షణ తీసుకున్నానని తెలిపారు. రకుల్ ప్రీత్‌సింగ్ గ్రామీణ యువతిగా చక్కగా నటించిందని అన్నారు. -
ఆశలన్నీ ఆ రెండింటి పైనే!
తమిళసినిమా: బహుభాషా నటీనటులుగా పేరుతెచ్చుకుంటే ఆ క్రేజే వేరు. ముఖ్యంగా అలాంటి హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. నటి నయనతార, అనుష్క, తమన్నా, కాజల్‌అగర్వాల్, సమంత వంటి తారలింకా అగ్రనాయికలుగా రాణించడానికి ఇదే కారణం. ఒక భాషలో అవకాశాలు తగ్గు ముఖం పట్టినా మరో భాషలో చేతి నిండా చిత్రాలుంటాయి. ఇప్పుడు నటి రకుల్‌కు అందని స్థాయి ఇదే. తొలుత కోలీవుడ్‌కే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండు మూడు చిత్రాల్లో నటించినా ఆదరణ లభించలేదు. దీంతో పొరుగు భాష తెలుగులో దృష్టి సారించి అక్కడ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ నాయకిగా రాణిస్తున్నా, కోలీవుడ్‌లో గెలవలేక పోయాననే చింత వెంటాడుతూనే ఉందట. తాజాగా కోలీవుడ్‌లోనూ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఏఆర్.మురుగదాష్ దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో మహేశ్‌బాబుతో రొమాన్స్ చేస్తోంది. మధ్యలో విశాల్‌కు జంటగా మిష్కిన్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా దాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఆ చిత్రం పో యిందన్న బాధను మరచిపోయేలా కార్తీతో ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంలో అవకాశం వరించింది. చతురంగవేట్టై చిత్రం ఫేమ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ పోలీస్ అధికారిగా నటిస్తుండగా, రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా పోలీస్ పాత్రలో కనిపించనుందట. కాగా ఈ రెండు చిత్రాలతోనే కోలీవుడ్‌లో తన భవిష్యత్ ఆధారపడి ఉందని రకుల్ ప్రీతిసింగ్ భావిస్తోందట. ఇక్కడ కూడా ఒక మంచి హిట్ వస్తే మరో కొన్నేళ్లు అగ్రనాయకిగా లాగించేయవచ్చన్నది ఈ అమ్మడు కలలు కంటోందట.