సీన్ రివర్స్.. ఛాన్స్‌ మిస్ | Rakul preeth singh movie offers in Kollywood | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 4 2018 4:48 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Rakul preeth singh movie offers in Kollywood - Sakshi

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రకుల్‌ ఇన్నాళ్లు కూల్‌గానే ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టుంది. ఈ అందాల భామకు అదృష్టంతో పాటు అందం కూడా బోలెడంత ఉంది. ఇప్పుడు ఈ భామకు వచ్చిన కష్టం ఏంటని అనుకుంటున్నారా? స్పైడర్‌ సినిమాతో తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తరువాత కార్తీ సరసన ధీరన్ అధిగరం ఒండ్రు (తెలుగులో ఖాకీ)తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత ఈ భామకు అవకాశాలు బాగా వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. వచ్చిన అవకాశాలు ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్లిపోతున్నాయి.

తెలుగులో  మొదటి సినిమా కెరటం నిరాశపరిచినా..రెండో సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. తరువాత చిన్న హీరోలతో నటిస్తూనే...పెద్ద హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. అవి వరుసగా హిట్స్‌ అవడంతో లక్కి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తన క్యూట్‌ లుక్స్‌తో, అందాల ఆరబోతతో కుర్రకారుకు మత్తెక్కించింది రకుల్‌ కూల్‌గా. లౌక్యం, పండుగచేస్కో, కిక్‌2 , నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ లాంటి వరుస హిట్‌లతో ఉన్న రకుల్‌ స్పీడుకి స్పైడర్‌ అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో చెప్పుదగ్గ సినిమాలేవి లేవు.

తమిళంలో వచ్చిన అవకాశాలు సైతం చేజారిపోతున్నాయి. విజయ్‌, మురుగదాస్‌ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో మొదట రకుల్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. తర్వాత ఆ అవకాశం కీర్తిసురేశ్‌కు దక్కింది. అంతేకాదు సూర్య, సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలోనూ రకుల్‌నే మొదట హీరోయిన్‌గా అనుకున్నా.. ఆ ప్లేస్ లో సాయి పల్లవిని తీసుకున్నారు. ఇలా ర‘కూల్‌’గా ఉండాల్సింది పోయి ఇప్పుడు టెన్షన్‌ పడాల్సి వస్తోంది. సౌత్ లో నిరాశపరిచినా. త్వరలో ఓ బాలీవుడ్ సినిమాతో ఉత్తరాదిలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది రకుల్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement