kay kay menon
-
ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ఓటీటీల్లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ జానర్ సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లు సైతం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. అందువల్లే క్రైమ్ జానర్లో ఎక్కువగా వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.విలక్షణ నటుడు కెకె మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ ముర్షిద్. ఈ సిరీస్‌లో ఆయన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈనెల 30 నుంచే జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా.. కెకె మీనన్ ఈ మధ్యే శేఖర్ హోమ్ అనే మరో సిరీస్‌లోనూ కనిపించారు. అంతేకాకుండా ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో తనూజ్ వీర్వానీ, వేదికా భండారీ, అనంగ్ దేశాయ్, జాకిర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు.Dushmanon ke liye bura waqt bankar, 20 saal baad, Bambai ka raja - Murshid Pathan apni takht par laut raha hai! 👑🔥#Murshid premieres 30th August, only on #ZEE5. Trailer out now! #MurshidOnZEE5 pic.twitter.com/mlh1I8skXS— ZEE5 (@ZEE5India) August 20, 2024 -
ట్రైలర్ టాక్: నాలుగు స్తంభాలాట
ఓటీటీ కంటెంట్‌లో అంథాలజీ(నాలుగైదు కథల సమూహారం) సిరీస్‌లకు ఈమధ్య ఫుల్ క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలో నెట్‌ఫ్లిక్స్ మరోక దానితో రాబోతోంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రాసిన కథల సమూహారం నుంచి నాలుగు కథలను తీసుకుని వాటి ఆధారంగా.. హిందీలో ‘రే’ సిరీస్‌ను నిర్మించింది నెట్‌ఫ్లిక్స్. ఈ సిరీస్ ట్రైలర్ ఇవాళే రిలీజ్ అయ్యింది. ఏదైనా గుర్తు పెట్టుకునే కంప్యూటర్ లాంటి బ్రెయిన్ ఉన్న ఒక వ్యక్తి, ఒక యువ నటుడు, ఒక ఫేమస్ కవి, ఒక మేకప్ ఆర్టిస్ట్.. ఈ నలుగురి జీవితాల కథాంశమే రే(కిరణం). కవిగా మనోజ్ వాజ్‌పాయి, సూపర్ మెమరీ ఉన్న వ్యక్తిగా మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్(గుడ్డూ), మేకప్ ఆర్టిస్ట్‌గా కయ్ కయ్ మీనన్, నటుడి రోల్లో హర్షవర్దన్ కపూర్లు యాక్ట్ చేశారు. సాఫీగా సాగిపోయే ఆ నలుగురి జీవితాల్లో కల్లోలం, వాళ్ల చీకటి గతం, ఆ నలుగురి కథలకు ఊహించని ముగింపుల హింట్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. అహం, అసూయ, వెన్నుపోటు, ప్రతీకారం.. చుట్టే ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఇక సత్యజిత్ రే కథల సమూహారంలో ‘హంగామా హై క్యోన్ బార్పా, ఫర్ గెట్ మీ ఆనట్, బహురూపియా, స్పాట్లైట్ ప్రామిస్’.. రే ఆంథాలజీ సిరీస్‌గా రాబోతోంది. గజ్రాజ్ రావ్, శ్వేతా బసు ప్రసాద్, అనిందితా బోస్, బిదితా బాగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ చౌబే, శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ బాల దీనిని తెరకెక్కించారు. జూన్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. చదవండి:ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ -
ఘాజీ సినిమాకు పన్ను మినహాయిస్తారా?
ముంబై: దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజీ సినిమాకు కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి వారంలో దేశవ్యాప్తంగా రూ.19 కోట్ల 40 లక్షల వసూలు చేసింది. పన్ను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు హీరో రానా తెలిపారు. ఈ సినిమా 1971లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన నేవీ యుద్ధ సన్నివేశాలతో తెరకెక్కింది. ఈ యుద్దం మొత్తం 18 రోజుల పాటు సముద్రం లోపల జరిగింది. అప్పటి భారత నేవీకి లెప్ట్నెంట్ కమాండర్ అర్జున్ వర్మ పాత్రలో రానా నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందని, త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభిస్తుందని ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి, నటులు అతుల్ కులకర్ణి, కేకే మీనన్‌లు ఆశాభావం వ్యక్తం చేశారు. -
టాలీవుడ్లోకి బాలీవుడ్ విలన్
సర్కార్, హైదర్, ఏబిసిడి లాంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నమళయాళీ నటుడు కె కె మీనన్ ఘాజీ సినిమాలో నటించనున్నాడు. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో రానా, ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. బాహుబలి 2 కోసం రెడీ అవుతున్న గ్యాప్‌లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తొలి సబ్ మెరైన్ వార్ బేస్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఘాజీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. రానాతో పాటు ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రకు ప్రకాష్ రాజ్‌ను ఎంపిక చేశారు చిత్రయూనిట్. అయితే ప్రకాష్ రాజ్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మన ఊరి రామాయణం సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటుడు కె కె మీనన్ ని ఎంపిక చేశారు. తాప్సీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పివిపి బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. -
వర్మకు బాలీవుడ్ నటుడి ప్రశంసలు
ముంబై: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై నటుడు కేకే మీనన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్మ్ మేకింగ్ కు వర్మ కొత్త నిర్వచనం ఇచ్చాడని ప్రశంసించాడు. 'సత్య, రంగీలా, సర్కార్ సినిమాలతో ఫిల్మ్ మేకింగ్ నిర్వచనం మార్చాడు వర్మ. ఈ సినిమాలు చూసిన తర్వాత మన సినిమా పరిశ్రమ కోమాలోకి వెళ్లిపోయింది. మూస సినిమాలు చేసి సొమ్ములు చేసుకునే సంప్రదాయాన్ని రాము మార్చేశాడు' అని మీనన్ పేర్కొన్నాడు. దాదాపు 20 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న కేకే మీనన్.. రాంగోపాల్ వర్మ 'సర్కార్' సినిమాలో నటించాడు. గెలుపోటములను సమానంగా స్వీకరించానని మీనడ్ చెప్పాడు.