వర్మకు బాలీవుడ్ నటుడి ప్రశంసలు
ముంబై: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై నటుడు కేకే మీనన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్మ్ మేకింగ్ కు వర్మ కొత్త నిర్వచనం ఇచ్చాడని ప్రశంసించాడు.
'సత్య, రంగీలా, సర్కార్ సినిమాలతో ఫిల్మ్ మేకింగ్ నిర్వచనం మార్చాడు వర్మ. ఈ సినిమాలు చూసిన తర్వాత మన సినిమా పరిశ్రమ కోమాలోకి వెళ్లిపోయింది. మూస సినిమాలు చేసి సొమ్ములు చేసుకునే సంప్రదాయాన్ని రాము మార్చేశాడు' అని మీనన్ పేర్కొన్నాడు.
దాదాపు 20 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న కేకే మీనన్.. రాంగోపాల్ వర్మ 'సర్కార్' సినిమాలో నటించాడు. గెలుపోటములను సమానంగా స్వీకరించానని మీనడ్ చెప్పాడు.