Satya Movie
-
వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ చిత్రాల్లో సత్య ఒకటి. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పేయి, ఊర్మిళ మటోండ్కర్ ప్రధాన పాత్రలు పోషించారు. 1998లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా మరోసారి థియేటర్లలో విడుదలైంది.ఎవర్నీ పట్టించుకోకుండా ఏడ్చేశా..రీరిలీజ్ సందర్భంగా సత్య సినిమాను వీక్షించిన దర్శకుడు ఆర్జీవీ (Ram Gopal Varma) భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. రెండు రోజుల క్రితం సత్య సినిమా చూశాను. 27 ఏళ్ల తర్వాత ఈ సినిమా చూస్తుంటే కన్నీళ్లాగలేవు. నా కన్నీళ్లు ఎవరైనా చూస్తారేమో అని కూడా పట్టించుకోకుండా ఏడ్చేశాను. సినిమా చూసి ఎమోషనలవలేదు. సత్య తర్వాత నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాను.సినిమా అంటే బిడ్డకు జన్మనివ్వడం లాంటిదేఒక సినిమా తీయడమంటే బిడ్డకు జన్మనివ్వడంలాంటిదే! సినిమాను ముక్కలు ముక్కలుగా చిత్రీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వస్తుందనేది తెలియదు. షూటింగ్ అయ్యాక దాన్ని చూసినవాళ్లు ఇది హిట్టనో, ఫట్టనో చెప్తూ ఉంటారు. నేను మాత్రం నేను సృష్టించిన సినిమా అందాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఈ సినిమాను లక్ష్యం లేని నా ప్రయాణంలో ఓ అడుగుగా మాత్రమే భావించాను. రెండు రోజుల క్రితం వరకూ అదే అభిప్రాయంతో ఉన్నాను. నా కన్నీళ్లకు కారణం..అపారమైన తెలివితేటలు ఉన్న నేను సత్య సినిమా (Satya Movie)ను బెంచ్‌మార్క్‌గా తీసుకుని భవిష్యత్తును ఎందుకు నిర్మించుకోలేదో అర్థం కావడం లేదు. నేను సినిమాలోని విషాదం చూసి చలించిపోలేదు. నన్ను నేను చూసుకుని ఏడ్చేశాను. సత్య సినిమాతో నన్ను నమ్మినవారందరికీ చేసిన ద్రోహాన్ని తలుచుకుని అపరాధ భావనతో కుమిలిపోయాను. సక్సెస్, అహంకారం తలకెక్కించుకుని తాగుబోతునయ్యాను. రంగీలా, సత్య సినిమా సక్సెస్ వల్ల నా కళ్లు నెత్తికెక్కాయి. అప్పుడే నా విజన్‌ను కోల్పోయాను. కళ్లకు గంతలు కట్టుకున్నా..తర్వాత నా సినిమాల్లో ఏవో జిమ్మిక్కులు, అసభ్యకరమైన ప్రదర్శనలు.. ఇలా అర్థంపర్థం లేని ప్రయోగాలు చేశాను. అయినప్పటికీ కొన్ని సినిమాలు సక్సెసయ్యాయి. కానీ సత్య మూవీలో ఉన్నంత దమ్ము, నిజాయితీ వాటిలో లేవు. చిత్రపరిశ్రమలో కొత్త తరహా చిత్రాలు చేయాలన్న ఆలోచనతో నా కళ్లకు నేనే గంతలు కట్టుకున్నాను. నా విలువ అర్థం చేసుకోలేక దేనికోసమో పరుగులు పెట్టాను. ఈ క్రమంలో నేను సృష్టించిన అందమైన గార్డెన్‌ను కాళ్ల కిందే తొక్కిపెట్టాను. తప్పుల్ని సరిదిద్దుకోలేనుఅప్పుడే నా పతనం మొదలైంది. నేను చేసిన తప్పులను ఎలాగో సరిదిద్దుకోలేను. కానీ ఇకపై దర్శకుడిగా నన్ను మొదటి స్థానంలో నిలబెట్టే సినిమాలే తీస్తాను. రెండు రోజుల క్రితం నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న మాట ఇది! సత్యలాంటి సినిమాను నేను మళ్లీ తీయలేకపోవచ్చు. కానీ అలాంటి సినిమాల్ని మీ ముందుకు తీసుకురావాలని ఆలోచించకపోవడం క్షమించరాని నేరమవుతుంది. దీనర్థం నేను సత్యలాంటి సినిమాలు మాత్రమే తీస్తానని కాదు. ఇకపై ఆ రూల్ పాటిస్తాజానర్ ఏదైనా సరే, తీసుకునే అంశం ఏదైనా సరే సత్యపై చూపించినంత నిజాయితీ ఇకమీదట ప్రతి సినిమాపై చూపిస్తాను. సత్య తర్వాత నేను చేయబోయే సినిమా ఎలా ఉంటుందని నన్నెవరూ అడగలేదు. కానీ ఆ ప్రశ్న నాకు నేను వేసుకోకపోవడం దారుణం. అందుకే మళ్లీ నేను వెనక్కు వెళ్లాలనుకుంటున్నాను. ఇకపై ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ చూడాలనుకుంటున్నాను. ఇదేదో ముందు నుంచీ పాటించుంటే చాలావరకు నా సినిమాలు వచ్చేవే కాదు.ఒట్టేసి చెప్తున్నా..ప్రతి దర్శకుడికి ఇదొక మేల్కొలుపుగా చెప్తున్నాను. చివరగా నా జీవితంలో మిగిలిన భాగం.. సత్యలాంటి విలువైన సినిమాలు తీయడానికే వెచ్చిస్తానని సత్య మూవీపై ఒట్టేసి చెప్తున్నాను అని ట్వీట్ చేశాడు. ఇది చూసిన అభిమానులు.. ఆర్జీవీ కొత్త వర్షన్ కోసం ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. A SATYA CONFESSION TO MYSELF —— Ram Gopal Varma By the time SATYA was rolling to an end , while watching it 2 days back for 1st time after 27 yrs, I started choking with tears rolling down my cheeks and I dint care if anyone would see The tears were not…— Ram Gopal Varma (@RGVzoomin) January 20, 2025 చదవండి: Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు.. -
ఆర్జీవీలోని విలక్షణతకు ఈ చిత్రం నిదర్శనం
ఆర్జీవీ.. రాం గోపాల్ వర్మ. సంచలనాలను, వివాదాలకు, అన్నింటికి మించి బోల్డ్‌కు కేరాఫ్. ఈ మధ్యకాలంలో వర్మ సినిమాల ఆడడం మాట ఏమోగానీ.. కెరీర్ తొలినాళ్లలో ఆయన ప్రదర్శించిన విలక్షణతను మరే దర్శకుడు కనబర్చలేదన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అప్పటిదాకా మూస ధోరణితో సాగిపోతున్న కమర్షియల్ సినిమాకు సత్య అనే గ్యాంగ్‌స్టర్ అనే డ్రామాను అందించి బాలీవుడ్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించడమే కాదు.. ఆ రియలిస్టిక్ సబ్జెక్టుతోనూ సంచలన విజయం అందుకున్నారాయన. 🎥 రియల్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని వర్మ చేసిన తొలి గొప్ప ప్రయత్నంగా సత్యను అభివర్ణిస్తుంటారు చాలామంది సినీ క్రిటిక్స్. అప్పటికే పదిదాకా సినిమాలు తీసిన అనుభవం.. మంచి సక్సెస్ రేటు అందుకున్న ఘనత కూడా ఉంది. అయితే.. బాలీవుడ్‌కు పెద్దగా పరిచయం ఉండని కొత్త ముఖాలతోనే సినిమా తీయాలనుకున్న వర్మ.. జేడీ చక్రవర్తిని గా తీసుకున్నారు. ఉర్మిళ హీరోయిన్ కాగా.. మనోజ్ బాజ్‌పాయితో పాటు సౌరభ్ శుక్లా లాంటి మెథడ్ యాక్టర్లు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే సీఐడీ ఫేమ్ ఆదిత్యా శ్రీవాస్తవ, తెలుగు నటుడు బెనర్జీకి మంచి గుర్తింపు దక్కింది. 🎥 ఓ కంప్లీట్ యాక్షన్ సినిమా తీయాలనుకున్న వర్మ.. కొందరు రియల్ క్రిమినల్స్‌ను కలుసుకున్నాక తన ఆలోచన మార్చేసుకున్నారట. అలా వాస్తవ జీవితాల నుంచి పుట్టిందే సత్య కథ. అలాగని సత్య కథ అల్లింది వర్మ కాదు. అందులో కల్లుమామ పాత్రధారి సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్‌లు రైటర్లు. అంతకు మించి.. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసం ముంబైకి వచ్చి.. అక్కడి నుంచి అండర్ వరల్డ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే సత్యది. 🎥 కోటి కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే సత్యకు భీకూతో స్నేహం, విద్యతో ప్రేమ బంధం.. మాఫియా మేఘాలు అలుముకుని చివరకు విషాద ముగింపు తీసుకోవడం.. ఇలా చాలా రియల్స్టిక్గా వర్మ చూపించిన విధానాన్ని ఆడియొన్స్ ఆదరించారు. 🎥 వాస్తవానికి.. కొత్త వాళ్లతో సినిమా వర్మ అనౌన్స్ చేయగానే చాలామంది ఆశ్చర్యపోయారట. అందుకు తగ్గట్లే.. సినిమా షూటింగ్ మొదలైన మూడు రోజులకే కొన్ని కారణాల వలన ఆగిపోయిందట. నిజానికి ఈ సినిమాలో సాంగ్స్ లేకుండా ప్లాన్ చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కారణంగా వర్మ, విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతలతో(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) మ్యూజిక్ కంపోజ్ చేయించాడు. Video Credits: Mango Music 🎥 రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం.. 1998 జులై 3వ తేదీన విడుదల అయ్యింది. ఐదు రెట్ల కలెక్షన్ల వసూలుతో భాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో పాటు.. 1998లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో నిలిచింది కూడా. 🎥 వర్మలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన సత్య.. ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు ఓ జాతీయ అవార్డును సైతం దక్కించుకుంది. మనోజ్ బాజ్పాయికి నేషనల్ అవార్డు దక్కింది. 🎥 మొత్తంగా వర్మ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా.. కల్ట్ హోదాను దక్కించుకుని భారతీయ చలన చిత్ర రంగంలో గొప్ప చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచింది. 🎥 2008 ఆస్కార్ అవార్డు అందుకున్న స్లమ్‌డాగ్ మిలీయనీర్ చిత్రానికి సత్య ఒక స్ఫూర్తి. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు డానీ బోయల్ స్వయంగా చెప్పాడు. సత్య సినిమా షూటింగ్ మూడో రోజు విన్న ఒక వార్త బాధాకరంగా అనిపించింది. టీ సిరీస్ గుల్షన్ కుమార్‌ను కాల్చి చంపారనే వార్త. ఆ తర్వాత అండర్‌వరల్డ్‌పై సినిమా తీయొద్దంటూ మా మీద ఒత్తిడి పెరిగింది. ఆ పరిణామం ఒకవైపు ఇబ్బందికరంగా, మరోవైపు బాధగా అనిపించింది. కానీ, వర్మ అనుకున్నది ఓ పట్టాన వదిలే రకం కాదు. తనకు రైట్ అనిపిస్తే చేసేస్తాడంతే. అదే సమయంలో.. తాను అనుకున్నది అండర్‌వరల్డ్‌ను గొప్పగా చూపించడం కాదని వర్మ తేల్చేశాడు. ఇంకేం.. అలా మాఫియా ప్రపంచంలో ఉండే భావోద్వేగాల్ని ప్రధానంగా చేసుకుని కథ తెరకెక్కింది.. మంచి విజయం అందుకుంది: జేడీ చక్రవర్తి ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో.. -
లిప్‌లాక్ వద్దన్న హీరో.. కారణం ఇదేనా!
చెన్నై: సాధారణంగా లిప్‌లాక్ సన్నివేశాలకు కథానాయికలు నో చెబుతుంటారు. అయితే తమిళ నటుడు సిబిరాజ్ హీరోయిన్‌తో లిప్‌లాక్ సన్నివేశంలో నటించడానికి ససేమిరా అన్నారు. ఆ సంగతేమిటో చూద్దాం. సత్యరాజ్ సమర్పణలో ఆయన కొడుకు సిబిరాజ్ హీరోగా నటిస్తూ, నాదాంబాళ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం సత్య. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నటి రామ్యానంబీశన్ హీరోయిన్ గానూ, నటి వరలక్ష్మీ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. 555 చిత్రం ఫేమ్ సైమన్ సంగీతాన్ని అందించారు. సత్య మూవీ జూన్ చివర్లో తెరపైకి రానుంది. ప్రదీప్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. గతంలో నటుడు కమలహాసన్ నటించిన సత్య చిత్రం ఆయన కేరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో, అదే విధంగా నటుడు సిబిరాజ్‌కు ఈ సత్య పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ కథా చిత్రం. తెలుగులో విజయం సాధించిన ‘క్షణం’ చిత్రానికి ఇది రీమేక్. మూవీ స్టోరీ డిమాండ్ మేరకు హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశం ఉంటుంది. అయితే, ఆ సీన్లో నటించాలని ఎంతగా నచ్చజెప్పినా హీరో సిబిరాజ్ మాత్రం ఒప్పుకోలేదు. ఈ చిత్రాన్ని తన కూతురు కూడా చూస్తుందనే కారణాన్ని సిబిరాజ్ చెప్పారని' ఈ సందర్భంగా వివరించారు. -
'సత్య' పాట పాడుకుంటూ.. కాల్చేసుకున్నాడు!
రాంగోపాల్ వర్మ తీసిన 'సత్య' సినిమాలో పాట పాడుకుంటూ.. ఓ వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. 'గోలీ మార్ భేజే మే (తలలో బుల్లెట్ కాల్చుకో)' అనే పాట పాడుకుంటూ నాటు తుపాకితో కాల్చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో శుక్రవారం జరిగింది. వీరేంద్ర శర్మ అనే ఈ వ్యక్తి సత్య సినిమా పాట పాడుకుంటూ ఇంటికి వెళ్లాడు. భార్యను అన్నం వడ్డించమని చెప్పి, ఈలోపే కాల్చేసుకున్నాడు. అన్నం తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్లిన కొద్ది సెకన్లకే బుల్లెట్ శబ్దం విన్న వీరేంద్ర భార్య.. వెంటనే పరుగున బయటకు వచ్చింది. చూసేసరికి భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు చెప్పారు. వీరేంద్రకు ఇంతకుముందు నేర చరిత్ర ఉంది. అతడిపై పలు కేసులు ఉండటంతో.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని తెలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు తాను తీసిన సత్య సినిమాలో పాట పాడుకుంటూ వీరేంద్ర శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో రాంగోపాల్ వర్మ కూడా అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని అతడు తన ట్విట్టర్లో షేర్ చేశాడు. -
వర్మకు బాలీవుడ్ నటుడి ప్రశంసలు
ముంబై: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై నటుడు కేకే మీనన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్మ్ మేకింగ్ కు వర్మ కొత్త నిర్వచనం ఇచ్చాడని ప్రశంసించాడు. 'సత్య, రంగీలా, సర్కార్ సినిమాలతో ఫిల్మ్ మేకింగ్ నిర్వచనం మార్చాడు వర్మ. ఈ సినిమాలు చూసిన తర్వాత మన సినిమా పరిశ్రమ కోమాలోకి వెళ్లిపోయింది. మూస సినిమాలు చేసి సొమ్ములు చేసుకునే సంప్రదాయాన్ని రాము మార్చేశాడు' అని మీనన్ పేర్కొన్నాడు. దాదాపు 20 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్న కేకే మీనన్.. రాంగోపాల్ వర్మ 'సర్కార్' సినిమాలో నటించాడు. గెలుపోటములను సమానంగా స్వీకరించానని మీనడ్ చెప్పాడు. -
సత్య 2 ఆడియో విడుదల హైలెట్స్
-
సత్య - 2 ఆడియో విడుదల వేడుక