'సత్య' పాట పాడుకుంటూ.. కాల్చేసుకున్నాడు! | man shoots self while singing song from satya movie | Sakshi
Sakshi News home page

'సత్య' పాట పాడుకుంటూ.. కాల్చేసుకున్నాడు!

Published Fri, Dec 25 2015 7:12 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

'సత్య' పాట పాడుకుంటూ.. కాల్చేసుకున్నాడు! - Sakshi

'సత్య' పాట పాడుకుంటూ.. కాల్చేసుకున్నాడు!

రాంగోపాల్ వర్మ తీసిన 'సత్య' సినిమాలో పాట పాడుకుంటూ.. ఓ వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. 'గోలీ మార్ భేజే మే (తలలో బుల్లెట్ కాల్చుకో)' అనే పాట పాడుకుంటూ నాటు తుపాకితో కాల్చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో శుక్రవారం జరిగింది. వీరేంద్ర శర్మ అనే ఈ వ్యక్తి సత్య సినిమా పాట పాడుకుంటూ ఇంటికి వెళ్లాడు. భార్యను అన్నం వడ్డించమని చెప్పి, ఈలోపే కాల్చేసుకున్నాడు.

అన్నం తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్లిన కొద్ది సెకన్లకే బుల్లెట్ శబ్దం విన్న వీరేంద్ర భార్య.. వెంటనే పరుగున బయటకు వచ్చింది. చూసేసరికి భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు చెప్పారు. వీరేంద్రకు ఇంతకుముందు నేర చరిత్ర ఉంది. అతడిపై పలు కేసులు ఉండటంతో.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని తెలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు

తాను తీసిన సత్య సినిమాలో పాట పాడుకుంటూ వీరేంద్ర శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో రాంగోపాల్ వర్మ కూడా అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని అతడు తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement