shoots self
-
బిహార్‌లో తుపాకీతో కాల్చుకుని తెలంగాణ జవాన్ ఆత్మహత్య!
పాట్నా: భారత సాయుధ బలగాల్లో ఒకటైన సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)కు చెందిన ఓ జవాన్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిహార్, సుపాల్ జిల్లాలోని వీర్పుర్లో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. ఆత్మహత్యకు పాల్పడింది ఎస్ఎస్బీ 45వ బెటాలియన్‌కు చెందిన జవాన్ చిమాల్ విష్ణుగా గుర్తించారు. ఆయన తెలంగాణకు చెందిన వారిగా అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. Bihar | A jawan of SSB (Sashastra Seema Bal) 45 battalion, Chimala Vishnu shot himself dead at Veerpur, Supaul today. He hailed from Telangana. Details awaited. — ANI (@ANI) August 19, 2022 ఇదీ చదవండి: బిహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్.. 8 నెలలుగా వసూళ్ల పర్వం -
ఇన్స్పెక్టర్ను కాల్చి చంపి ఎస్ఐ ఆత్మహత్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ 122వ బెటాలియన్‌లో కాల్పులు కలకలం చోటు చేసుకున్నాయి. ఇన్స్పెక్టర్ దశరథ్‌సింగ్(56)ను ఎస్ఐ కర్నేల్‌సింగ్(55) కాల్చి చంపారు. అనంతరం ఎస్ఐ కర్నేల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన లోధి ఎస్టేట్‌లోని హోంమంత్రి భవనం వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ దశరథ్‌సింగ్, ఎస్ఐ కర్నేల్‌సింగ్ మధ్య శుక్రవారం రాత్రి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఎస్ఐ తన సర్వీస్ గన్‌తో ఇన్స్పెక్టర్ దశరథ్ సింగ్‌పై కాల్పులు జరిపాడు. దీంతో దశరథ్‌సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అదే గన్‌తో ఎస్ఐ కర్నేల్ సింగ్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. (హత్య కేసులో ఐపీఎస్ అధికారిపై వేటు) సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. ఎస్ఐ కర్నేల్‌సింగ్ జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌కు చెందినవారు కాగా, ఇన్స్పెక్టర్ దశరథ్‌సింగ్ హర్యానాలోని రోహ్తక్కు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. (కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ) -
'సత్య' పాట పాడుకుంటూ.. కాల్చేసుకున్నాడు!
రాంగోపాల్ వర్మ తీసిన 'సత్య' సినిమాలో పాట పాడుకుంటూ.. ఓ వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయాడు. 'గోలీ మార్ భేజే మే (తలలో బుల్లెట్ కాల్చుకో)' అనే పాట పాడుకుంటూ నాటు తుపాకితో కాల్చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో శుక్రవారం జరిగింది. వీరేంద్ర శర్మ అనే ఈ వ్యక్తి సత్య సినిమా పాట పాడుకుంటూ ఇంటికి వెళ్లాడు. భార్యను అన్నం వడ్డించమని చెప్పి, ఈలోపే కాల్చేసుకున్నాడు. అన్నం తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్లిన కొద్ది సెకన్లకే బుల్లెట్ శబ్దం విన్న వీరేంద్ర భార్య.. వెంటనే పరుగున బయటకు వచ్చింది. చూసేసరికి భర్త రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు చెప్పారు. వీరేంద్రకు ఇంతకుముందు నేర చరిత్ర ఉంది. అతడిపై పలు కేసులు ఉండటంతో.. ఇక వాటి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని తెలిసి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు తాను తీసిన సత్య సినిమాలో పాట పాడుకుంటూ వీరేంద్ర శర్మ ఆత్మహత్య చేసుకోవడంతో రాంగోపాల్ వర్మ కూడా అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని అతడు తన ట్విట్టర్లో షేర్ చేశాడు. -
కూతుర్ని వాళ్ల పిల్లల్ని చంపేసిన డాన్
హ్యూస్టన్: ఆ కన్న తండ్రి ఎందుకు చేశాడో ఏమో... కన్న కూతురితోపాటు ఆరుగురు చిన్నారులను తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం అతడు కూడా అదే తుపాకీతో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం అమెరికాలోని హ్యూస్టన్‌లో బెల్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. అయితే నిందితుడైన కన్న తండ్రి డాన్ స్పిరిట్ (51) తాను ఆత్మహత్య పాల్పడే ముందు ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసి... అత్యవసరంగా రావాలని కోరాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. డాన్ చెప్పిన చిరునామా గల ఇంటికి ఎమర్జెన్సీ అధికారులు చేరుకున్నారు. అప్పటికే ఇంట్లో రక్తపు మడుగులో ఎనిమిది శవాలుగా పడి ఉన్నాయి. దీంతో ఎమర్జెన్సీ అధికారులు ఆ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక అసుపత్రికి తరలించారు. అయితే మృతుల్లో చిన్నారులంతా 3 నుంచి10 ఏళ్ల లోపు వయస్సు వారేనని వారు తెలిపారు. డాన్ ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడో కారణాలు తెలియలేదని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.