కూతుర్ని వాళ్ల పిల్లల్ని చంపేసిన డాన్ | Man kills seven family members, shoots self in US | Sakshi
Sakshi News home page

కూతుర్ని వాళ్ల పిల్లల్ని చంపేసిన డాన్

Published Fri, Sep 19 2014 8:55 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

కూతుర్ని వాళ్ల పిల్లల్ని చంపేసిన డాన్ - Sakshi

కూతుర్ని వాళ్ల పిల్లల్ని చంపేసిన డాన్

హ్యూస్టన్: ఆ కన్న తండ్రి ఎందుకు చేశాడో ఏమో... కన్న కూతురితోపాటు ఆరుగురు చిన్నారులను తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం అతడు కూడా అదే తుపాకీతో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం అమెరికాలోని హ్యూస్టన్లో బెల్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. అయితే నిందితుడైన కన్న తండ్రి డాన్ స్పిరిట్ (51) తాను ఆత్మహత్య పాల్పడే ముందు ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసి... అత్యవసరంగా రావాలని కోరాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. డాన్ చెప్పిన చిరునామా గల ఇంటికి ఎమర్జెన్సీ అధికారులు చేరుకున్నారు.

అప్పటికే ఇంట్లో రక్తపు మడుగులో ఎనిమిది శవాలుగా పడి ఉన్నాయి. దీంతో ఎమర్జెన్సీ అధికారులు ఆ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక అసుపత్రికి తరలించారు. అయితే మృతుల్లో చిన్నారులంతా 3 నుంచి10 ఏళ్ల లోపు వయస్సు వారేనని వారు తెలిపారు. డాన్ ఈ ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడో కారణాలు తెలియలేదని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement