
చంద్రశేఖర్‌కు నాలుగేళ్ల క్రితం మౌనికతో వివాహం జరిగింది.
ఏటూరునాగారం : సంతానం కలగడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎలిశెట్టిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం. ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన హన్మంతరావు–నర్సక్క కుమారుడు పులిశె చంద్రశేఖర్(28) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రశేఖర్‌కు నాలుగేళ్ల క్రితం మౌనికతో వివాహం జరిగింది.
అతనికి సంతానం కలగడం లేదని గత కొంత కాలంగా మద్యానికి బానిసై ఈనెల 28న ఆదివారం భార్యతో గొడవపడగా అతని భార్య పుట్టింటికి వెళ్లిందన్నారు. సంతానం కలగడం లేదని జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్క వారు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.