సర్కార్, హైదర్, ఏబిసిడి లాంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నమళయాళీ నటుడు కె కె మీనన్ ఘాజీ సినిమాలో నటించనున్నాడు. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ హీరో రానా, ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. బాహుబలి 2 కోసం రెడీ అవుతున్న గ్యాప్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తొలి సబ్ మెరైన్ వార్ బేస్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఘాజీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.
రానాతో పాటు ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రకు ప్రకాష్ రాజ్ను ఎంపిక చేశారు చిత్రయూనిట్. అయితే ప్రకాష్ రాజ్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మన ఊరి రామాయణం సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటుడు కె కె మీనన్ ని ఎంపిక చేశారు. తాప్సీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను పివిపి బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
టాలీవుడ్‌లోకి బాలీవుడ్ విలన్
Published Tue, Jan 19 2016 9:44 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM
Advertisement
Advertisement