ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ : రానా, కోహ్లీకి హైకోర్టు షాక్‌ | Online Gambling : Madras High Court Send Notes To Celebrities | Sakshi
Sakshi News home page

రానా, కోహ్లీకి మద్రాసు హైకోర్టు నోటీసులు‌

Published Tue, Nov 3 2020 3:56 PM | Last Updated on Tue, Nov 3 2020 6:06 PM

Online Gambling : Madras High Court Send Notes To Celebrities - Sakshi

చెన్నై : ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌పై సెలబ్రిటీలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాంబ్లింగ్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన క్రికెటర్లు విరాట్‌ కొహ్లి, సౌరవ్‌ గంగూలీ, సినీ నటులు దగ్గుపాటి రానా, సుదీప్‌, ప్రకాశ్‌ రాజ్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని పిటిషినర్‌ తెలిపాడు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌కు మద్దతుగా ప్రకటనల్లో నటించిన సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. ఈ ప్రకటనల్లో ఎందుకు నటించాల్సి వచ్చిందో ఈ నెల 19లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement