రానా సినిమా చేయనన్న ప్రకాష్రాజ్ | prakash raj exits rana film ghazi | Sakshi
Sakshi News home page

రానా సినిమా చేయనన్న ప్రకాష్రాజ్

Published Sat, Dec 5 2015 12:36 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానా సినిమా చేయనన్న ప్రకాష్రాజ్ - Sakshi

రానా సినిమా చేయనన్న ప్రకాష్రాజ్

ప్రస్తుతం బాహుబలి 2 కోసం రెడీ అవుతున్న రానా.. ఆ సినిమా తరువాత మరో ఆసక్తికరమైన సినిమాకు కమిట్ అయ్యాడు. భారత్ పాకిస్తాన్ల యుద్ధ సమయంలో విశాఖ తీరంలో మునిగిపోయిన జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కుతున్న 'ఘాజీ' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు రానా. వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానాతో పాటు మరో కీలకపాత్రకు ప్రకాష్రాజ్ను ఎంపిక చేశారు. తొలుత ఈ పాత్రలో నటించడానికి అంగీకరించిన ప్రకాష్, ఇప్పుడు చేయలేనని చెప్పాడట.

తనే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'మన ఊరి రామాయణం' సినిమాను ఇటీవలే ప్రకటించిన ప్రకాష్ రాజ్.. ఆ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇతర సినిమాలను అంగీకరించటం సరికాదని భావించి, ఘాజీ సినిమా నిర్మాతలకు డేట్స్ ఇవ్వలేనని చెప్పాడు. ప్రకాష్ రాజ్ కాదన్న ప్లేస్లో మరో నటుడి కోసం వేట ప్రారంభమైంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement