ray
-
అంతరించిపోతున్న జాబితాలోకి మరిన్ని జీవులు
పరి: ప్రపంచపటంపై అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి మరిన్ని జీవులు చేరుతూనే ఉన్నాయి. 2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయిందని తాజాగా విడుదలైన రెడ్లిస్టు చెబుతోంది. అంతర్జాతీయంగా ఉనికి ప్రమాదంలో పడిన జీవజాలం వివరాలను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) నమోదు చేస్తుంటుంది. తాజాగా కొమొడో డ్రాగన్ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలోకి ఎక్కిందని ఐయూసీఎన్ తెలిపింది. పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయని వివరించింది. చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి. షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగిందని తెలిపింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణమని, సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయిందని తెలిపింది. అయితే దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించిందని ఐయూసీఎన్ డైరెక్టర్ బ్రూనో ఒబెర్లె చెప్పారు. సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉందని సంస్థ తెలిపింది. కరిగిపోతున్న మంచు తో 2100 నాటికి దాదాపు 98 శాతం ఎంపరర్ పెంగి్వన్లు నశించిపోయే ప్రమాదం ఉందంది. -
ట్రైలర్ టాక్: నాలుగు స్తంభాలాట
ఓటీటీ కంటెంట్‌లో అంథాలజీ(నాలుగైదు కథల సమూహారం) సిరీస్‌లకు ఈమధ్య ఫుల్ క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలో నెట్‌ఫ్లిక్స్ మరోక దానితో రాబోతోంది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రాసిన కథల సమూహారం నుంచి నాలుగు కథలను తీసుకుని వాటి ఆధారంగా.. హిందీలో ‘రే’ సిరీస్‌ను నిర్మించింది నెట్‌ఫ్లిక్స్. ఈ సిరీస్ ట్రైలర్ ఇవాళే రిలీజ్ అయ్యింది. ఏదైనా గుర్తు పెట్టుకునే కంప్యూటర్ లాంటి బ్రెయిన్ ఉన్న ఒక వ్యక్తి, ఒక యువ నటుడు, ఒక ఫేమస్ కవి, ఒక మేకప్ ఆర్టిస్ట్.. ఈ నలుగురి జీవితాల కథాంశమే రే(కిరణం). కవిగా మనోజ్ వాజ్‌పాయి, సూపర్ మెమరీ ఉన్న వ్యక్తిగా మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్(గుడ్డూ), మేకప్ ఆర్టిస్ట్‌గా కయ్ కయ్ మీనన్, నటుడి రోల్లో హర్షవర్దన్ కపూర్లు యాక్ట్ చేశారు. సాఫీగా సాగిపోయే ఆ నలుగురి జీవితాల్లో కల్లోలం, వాళ్ల చీకటి గతం, ఆ నలుగురి కథలకు ఊహించని ముగింపుల హింట్‌తో ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. అహం, అసూయ, వెన్నుపోటు, ప్రతీకారం.. చుట్టే ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఇక సత్యజిత్ రే కథల సమూహారంలో ‘హంగామా హై క్యోన్ బార్పా, ఫర్ గెట్ మీ ఆనట్, బహురూపియా, స్పాట్లైట్ ప్రామిస్’.. రే ఆంథాలజీ సిరీస్‌గా రాబోతోంది. గజ్రాజ్ రావ్, శ్వేతా బసు ప్రసాద్, అనిందితా బోస్, బిదితా బాగ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ చౌబే, శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ బాల దీనిని తెరకెక్కించారు. జూన్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. చదవండి:ఫ్యామిలీమ్యాన్ 2 రివ్యూ -
శ్రావణ కిరణం
21 ఏళ్లకే సీఏ పట్టా అందుకున్న విద్యార్థి పరకాల : ప్రస్తుత కాలంలో చాలామంది విద్యార్థులు పదో తరగతి పూర్తికాగానే ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులను అభ్యసించేందుకు వెళ్తుంటారు. మరికొందరు మెడిసిన్, ఇంజినీరింగ్‌ను పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఆరాటపడుతుంటారు. అయితే ఓ విద్యార్థి మాత్రం అందరిలా సంప్రదాయ కోర్సులను చదవకుండా భిన్నంగా, ఎంతో కష్టతరంగా ఉండే చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)ను అభ్యసించేందుకు ఆసక్తి చూపాడు. ఈ మేరకు తాను ఎంచుకున్న కోర్సును చిరుప్రాయంలోనే విజయవం తంగా పూర్తి చేసి పలువురు విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన గంజి పద్మ, వెంకట్‌రెడ్డి దంపతులకు కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వెంకట్‌రెడ్డి ఉద్యోగరీత్యా కొన్నేళ్ల క్రితం పరకాలకు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన నగర పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఫస్ట్.. వెంకటరెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు శ్రావణŠ కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. 1995 ఆగస్టు 7వ తేదీన జన్మించిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి 1 నుంచి 8వ తరగతి వరకు పరకాలలోనే చదివాడు. 8 నుంచి 10వ తరగతి వరంగల్ ఎస్పీఆర్లో పూర్తి చేశాడు. కాగా, 2010లో పదో తరగతి ఫలితాల్లో ఆయన 600 మార్కులకు 538 సాధించి ప్రతిభ కనబరిచాడు. 2012లో ఎంఈసీ గ్రూపులో 1000కి 937 మార్కులు సాధించాడు. అనం తరం సీపీటీలో ప్రవేశ పరీక్ష రాయగా 200 మార్కులకు 172 మార్కులను సాధించాడు. అలాగే ఐపీసీసీలో 700 మార్కు లకు 385 మార్కులను సాధించి ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత రెండేళ్ల పాటు ప్రముఖ ఆడిటర్ తిప్పర్తి రాఘవరెడ్డి దగ్గర అప్రెంటీస్ పూర్తి చేశాడు. మంచి మార్కులతో సీఏ ఉత్తీర్ణత గత మే నెలలో జరిగిన సీఏ ఫైనల్ పరీక్షకు హాజరైన శ్రావణ్‌కుమార్‌రెడ్డి 800 మార్కులకు 479 మార్కులు సాధించాడు. మెుత్తం మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. కాగా, గత ఏడాదిలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి సాధించిన 479 మార్కులకు ఆలిండియా ర్యాంకు రాగా.. ఇప్పుడు త్రుటిలో జాతీయ ర్యాంకు కోల్పోయాడు. ఇదిలా ఉండగా, సీఏ గ్రూపు–1, గ్రూపు–2లో మొత్తంగా 8 సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిలో ఏ ఒక్క సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చిన సీఏలో అనర్హుడిగానే పరిగణిస్తారు. కానీ.. శ్రావణ్‌కుమార్‌రెడ్డి మాత్రం ఒకేసారి 8 సబ్జెక్ట్‌లను రాసి మొదటి శ్రేణిలో పాస్ కావడం విశేషం. ఎంతో కష్టమైన సీఏ కోర్సును చిన్న వయస్సులోనే పూర్తి చేసి రికార్డు సాధించిన శ్రావణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తున్నారు. కష్టమని తెలిసే ఎంచుకున్నా. ఇంటర్ తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులను అభ్యసించేందుకు ఆరాటపడుతుంటారు. నాకు మొదటి నుంచి గణితం, సైన్స్‌లో 98 శాతం మార్కులు వచ్చేవి. దీంతో ఇంట్లో అందరు నన్ను ఇంజినీరింగ్ చేయాలని ఒత్తిడి చేశారు. నాకు మాత్రం సీఏ చేయాలనే ఉండేది. సమాజంలో సీఏలకు మంచి గౌరవం ఉంటుంది. అందుకనే ఆ కోర్సును పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నా. సీఏ చదివేందుకు అమ్మనాన్న నాకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. మా సార్ రాఘవరెడ్డి నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆయన ప్రోత్సహంతో మొదటి ప్రయత్నంలోనే సీఏను సాధించాను. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివినందుకే ఫలితం వచ్చింది. –గంజి శ్రావణ్‌కుమార్‌రెడ్డి -
''రేయ్'' టీమ్‌తో చిట్ ఛాట్!