
అందరూ జాగ్రత్తలు పాటిస్తే షూటింగ్ సులువే అని, కాని ఒక్కరి తప్పిదం వల్ల తనకు కరోనా రావడమే కాక తాను నటిస్తున్న ‘డిస్పాచ్’ షూటింగ్ ఆగిపోయిందని నటుడు మనోజ్ బాజ్‌పాయ్ మొత్తుకుంటున్నాడు. తాజాగా మనోజ్ బాజ్‌పాయ్ కరోనా బారిన పడ్డాడు. అతడు షూటింగ్ చేస్తున్న ‘డిస్పాచ్’ సినిమా డైరెక్టర్ కాను భెల్‌కు మొదట కరోనా వచ్చింది. తర్వాత మనోజ్ బాజ్‌పాయ్ దాని బారిన పడ్డాడు. 51 ఏళ్ల ఈ ‘సత్య’ బీకూ మాత్రే ప్రస్తుతం ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. డిస్పాచ్ షూటింగ్ రెండు నెలలు వాయిదా పడింది. ‘కరోనా జాగ్రత్తలు సరిగ్గా తీసుకుంటే షూటింగ్ చాలా సులభం. కానీ ఆ యూనిట్‌లో ఒకరి నిర్లక్ష్యం వల్ల కరోనా వచ్చింది’ అని అతడు మండిపడ్డాడు.
‘కరోనాతో జీవించక చుట్టూ కరోనా పెట్టుకుని పని చేయక పరిస్థితులు వచ్చాయి. దీనిలోని వాస్తవాన్ని స్వీకరించి జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఎలా ఉండగలం’ అని ఫైర్ అయ్యాడు. ‘నెమ్మదిగా కోలుకుంటున్నా’ అని సమాచారం ఇచ్చాడు. మనోజ్ నటించిన తాజా సినిమా ‘సైలెన్స్... కెన్ యూ హియర్ ఇట్’ జీ5లో మార్చి 26 నుంచి స్ట్రీమ్ కానుంది. ‘హటాత్తుగా అదృశ్యమైపోయిన ఒక స్త్రీని వెతకడం ఈ కథ. చాలా ఆసక్తిగా ఉంటుంది’ అని మనోజ్ బాజ్‌పాయ్ అన్నాడు. ఏమైనా కరోనా గతించి పోయింది అన్న సమయంలో మళ్లీ చెలరేగుతూ హీరో ఆడియెన్స్ అనే తేడా లేకుండా ఆడుకుంటోంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
చదవండి: అక్కినేని అభిమానులకు ఆర్‌జీవీ సర్‌ప్రైజ్
నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్