కూరగాయల దగ్గర బేరాలు ఆడితే తిడుతున్నారు: బాలీవుడ్‌ నటుడు | Manoj Bajpayee Says He Gets Scolded by Vegetable Vendors for Bargaining | Sakshi
Sakshi News home page

Manoj Bajpayee: కూరగాయల వ్యాపారితో బేరాలు.. నా భార్య నేనెవరో తెలీదన్నట్లు..

Published Tue, May 28 2024 7:18 PM | Last Updated on Tue, May 28 2024 7:48 PM

Manoj Bajpayee Says He Gets Scolded by Vegetable Vendors for Bargaining

బేరం (బార్కేనింగ్‌) ఆడటం అందరికీ చేత కాదు. అమ్మేవాళ్లు ఎంత చెప్పినా సరే కొనేవాళ్లు మాత్రం బేరమాడి వారు అనుకున్న తక్కువ ధరకు ఆయా వస్తువులను సొంతం చేసుకుంటారు. ఈ బేరమాడే క్రమంలో కొన్నిసార్లు సఫలమైనా మరికొన్నిసార్లు అక్షింతలు పడుతుంటాయి. అయితే తాను కూరగాయలు అమ్మేవారి దగ్గర బేరమాడానంటున్నాడు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌.

బేరాలు..
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతడికి ఎప్పుడైనా కూరగాయల దగ్గర బేరమాడారా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకతడు స్పందిస్తూ నేను బేరాలడితే తిడుతున్నారు. ఇది మీకు సూటవదని చెప్తున్నారు. నేనేమో.. బేరమాడటం ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్‌ చేస్తున్నానని చెప్పాను. 

నేనెవరో తెలీదన్నట్లు..
నా భార్య షబానా అయితే నేనెవరో తెలీదన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తనకు బేరాలడటమనేది అస్సలు నచ్చదు. అలాగే మేము ప్లాస్టిక్‌ బ్యాగులకు బదులుగా జనపనారతో చేసిన క్యారీ బ్యాగులు వాడుతున్నాం. ఏ సరుకులు కొనడానికి వెళ్లినా ఆ బ్యాగునే తీసుకెళ్తాం అని మనోజ్‌ బాజ్‌పాయ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: తెలివితక్కువదానిలా ఉన్నావంటూ ఆ హీరో తిట్టాడు: సీనియర్‌ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement