పేరెంట్స్‌ను బతికుండగానే కాటికి వెళ్లిపోమని చెప్పడం ఎంతటి నేరం, ఘోరం..! కానీ తనకు అలా చెప్పక తప్పలేదంటున్నాడు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్. తన తండ్రి ఆర్‌కే బాజ్‌పాయ్ మంచం మీద చివరి స్టేజీలో ఉన్నప్పుడు ఆయన అవస్థ చూడలేక వెళ్లిపోమని చెప్పాడట.. ఈ బాధాకర విషయాన్ని మనోజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
అత్యంత విషాదకరమైన సంఘటన
'నా జీవితంలోనే అత్యంత విషాదకరమైన సంఘటన నాన్న మరణం. ఒక రోజు నా సోదరి ఫోన్ చేసి నాన్న జీవితం పూర్తయిందని చెప్పింది. డాక్టర్లు మాత్రం ఆయన ఇంకా ఈ ప్రపంచంలోనే ఇరుక్కుపోయాడన్నారు. నాకు, నాన్నకు మధ్య ఎక్కువ ఆప్యాయత ఉండేది. అందుకని నన్నే అతడిని విముక్తి చేయాలని చెప్పారు. అప్పుడు నేను కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ సెట్స్‌లో ఉన్నాను.
ప్లీజ్ వెళ్లిపో..
నా వ్యాన్‌లో ఓ బాయ్ ముందే నాన్నతో ఫోన్‌లో మాట్లాడాను. నాన్న, నొప్పి భరించింది చాలు.. ప్లీజ్ వెళ్లిపో.. అందరినీ వదిలి వెళ్లిపోయే సమయం వచ్చేసింది అని చెప్పాను. అలా మాట్లాడినందుకు నా మనసు ఎంత కుంగిపోయిందో! నా మాటల్ని విన్న బాయ్ ఏడ్చేశాడు. ఆ రోజులు ఎంత కష్టంగా గడిచాయో నాకు మాత్రమే తెలుసు. నేను అలా మాట్లాడిన తర్వాతి రోజు తెల్లవారుజామున నాన్న చనిపోయాడు. నాన్న నన్ను చూడాలనే తన శరీరాన్ని వదిలి వెళ్లిపోలేదు.
Father’s Day 🙏🙏 pic.twitter.com/SMScmr038r
— manoj bajpayee (@BajpayeeManoj) June 18, 2023
ఆ మరుసటి రోజే
ఎప్పుడైతే నా గొంతు విన్నాడో అప్పుడు ఆయన మనసు తేలికపడింది. ఆయన చనిపోయారన్న వార్త వినగానే కన్నీళ్లాగలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మా అమ్మకు క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది. తను ఊరిలో ఉండి సొంత వైద్యం ప్రయత్నించింది. అయితే నా సోదరి మెరుగైన వైద్యం కోసం అమ్మను సిటీకి తీసుకొచ్చింది. కానీ ఆమెకు మా మీద ఆధారపడటం ఎంతమాత్రం ఇష్టం లేదు.
చావే నయం!
ఒకరి మీద ఆధారపడటం కన్నా చావే నయమని డాక్టర్స్‌తో చెప్పింది. నాన్న చనిపోయిన మరుసటి ఏడాదే ఆమె కూడా మరణించింది' అని మనోజ్ బాజ్‌పాయ్ చెప్పుకొచ్చాడు. కాగా నటుడి తండ్రి ఆర్‌కే బాజ్‌పాయ్ 2021 అక్టోబర్‌లో చనిపోగా తల్లి 2022 డిసెంబర్‌లో మరణించింది.
చదవండి: ఎన్టీఆర్ షర్ట్‌పై రచ్చ
Comments
Please login to add a commentAdd a comment