సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఎన్టీఆర్ షర్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. హీరో ఎన్టీఆర్ ఉదయమే తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లో ఓబుల్‌రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి, తల్లి షాలిని కలిసి వెళ్లి, సామాన్యుడిలా క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. దీనికి కారణంగా పోలింగ్‌కి ఆయన వేసుకొచ్చి చొక్కానే. ఆయన బ్లూ షర్ట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. దీంతో ఎన్టీఆర్ పరోక్షంగా వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకు మద్దతుగానే ఎన్టీఆర్ బ్లూషర్ట్ వేసుకొచ్చాడంటూ వైఎస్సార్‌సీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫోటోని వైరల్ చేస్తున్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ తన కుటుంబ పార్టీ అయిన టీడీపీతో పాటు ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు చేసిన మోసాలను తెలుసుకొనే ఎన్టీఆర్ పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. లోకేష్ కోసమే చంద్రబాబు నందమూరి ఫ్యామిలీ సభ్యులను పార్టీలో ఎదగకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ స్నేహితులు కొడాలి నాని, వంశీ వైఎస్సార్‌సీపీ పార్టీలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ ఎన్నికల్లో ప్రత్యేక్షంగా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా.. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగానే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
Superstar Jr NTR (@tarak9999) came out wearing BLUE Shirt to Vote
Big Signal to his Fan. #VoteForFan pic.twitter.com/GJgmO5nlg7— Avesh Kumar Singh (@AveshKumarSingh) May 13, 2024
Comments
Please login to add a commentAdd a comment