
Manoj Bajpayee Father Admitted to a Hospital in Delhi: బాలీవుడ్ నటుడు, ‘ఫ్యామిలీ మ్యాన్’ ఫేం మనోజ్ బాజ్‌పేయి తండ్రి ఆర్కే బాజ్‌పేయి ఆరోగ్యం విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం తెలిసిన నటుడు తన కమిట్‌మెంట్స్..
బాలీవుడ్ నటుడు, ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఫేం మనోజ్ బాజ్‌పేయి తండ్రి ఆర్కే బాజ్‌పేయి (83) అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలిసిన ఈ యాక్టర్ హుటాహుటిన కేరళలో షూటింగ్ నుంచి అక్కడికి చేరుకున్నాడు. నిజానికి ఈ నటుడు తన తండ్రితో ఎంతో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఆయన చేసే వంటల గురించి ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కాగా ఆర్కే బాజ్‌పేయి పరిస్థితి విషమంగా ఉందని, అందుకే మనోజ్ తన కమిట్‌మెంట్స్ అన్నింటిని వదిలేసి వచ్చేశాడని సన్నిహితుడు ఒకరు తెలిపాడు.
(చదవండి: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫ్యామిలీ మ్యాన్ 2)
కాగా, బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. తర్వాత అవకాశాల కోసం ముంబైకి చేరాడు. ఈ 52 ఏళ్ల నటుడు ప్రస్తుతం ఓటీటీల్లో విజయాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. కాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు రావడం వల్ల ఇండస్ట్రీలో ఎంతో మార్పు వచ్చిందని, మంచి రచయితలు, దర్శకులకి డిమాండ్ పెరిగిందని కొన్ని ఇంటర్వూల్లో ఈ ‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
My gr8 father!dicussing the mutton that he cooks very well.yumyum pic.twitter.com/vKBCoBTU
— manoj bajpayee (@BajpayeeManoj) October 5, 2012