బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ బీ టౌన్‌లో పరిచయం అవసరం లేదు. ఆయన టాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటించారు. సుమంత్ హీరోగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకథ’ చిత్రంలో విలన్‌గా నటించారు. అల్లు అర్జున్ మూవీ హ్యాపీలో తనదైన నటనతో మెప్పించారు. ఆయన నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సక్సెస్ అందుకున్నారు. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను మొదటిసారి ఫారిన్‌కు వెళ్లినపుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.
మనోజ్ మాట్లాడుతూ..'నేను థియేటర్ ఆర్టిస్టుగా ఉన్నపుడు పారిస్ వెళ్లా. అదే నాకు ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్ జర్నీ. ఇండియా నుంచి వెళ్లేటపుడు ఆల్కహాల్ తీసుకోలేదు. దానికి డబ్బులు తీసుకుంటారనుకున్నా. కానీ ఫ్లైట్‌లో మందు ఫ్రీగా సర్వ్ చేస్తారని నాకు తెలియదు. అక్కడికి వెళ్లిన తర్వాతే తెలిసింది. ఆ తర్వాత రిటర్న్ జర్నీలో ఫుల్‌గా తాగేసి పడిపోయా.' అని చెప్పుకొచ్చాడు.
కాగా.. మనోజ్ చివరగా గుల్మోహర్ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో డెస్పాచ్, సూప్, జోరమ్ చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment