
జాన్ అబ్రహాం
‘నేరగాళ్లకు శిక్ష తప్పదు. అవినీతికి అంతం తప్పదు’ అంటున్నారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం. మిలప్ జవేరి దర్శకత్వంలో జాన్ అబ్రహాం కథానాయకుడిగా నటించిన సినిమా ‘సత్యమేవ జయతే’. మనోజ్ బాజ్‌పేయి, అమృత కవిల్వర్, ఐషా శర్మ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున న్యాయం ధ్వనిస్తుంది’’ అని సినిమాను ఉద్దేశించి సోషల్ మీడియాలో పేర్కొన్నారు జాన్. అయితే ఇదే రోజున అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన హాకీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా ‘గోల్డ్’ రిలీజ్ కానుంది. సో.. బాక్సాఫీస్ వద్ద అక్షయ్ వర్సెస్ జాన్ తప్పదన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment